Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నువ్వు హాఫ్ కెప్టెన్‌వి భై!'..దోస్తుల మధ్య అదిరిపోయే ఫైట్! (వీడియో)

టీమిండియా యువ కెరటాలు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ స్టేడియంలో ఎంత దూకుడుగా ఉంటారో.. బయట అంత సరదాగా ఉంటారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు వీరిద్దరూ ఒకరిపై ఒకరు వేసుకున్న సెటైర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇషాన్ కిషన్‌ను శుభ్‌మన్ గిల్ "హాఫ్ కెప్టెన్" అంటూ ఆటకట్టించడం హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగిందంటే?
ఐపీఎల్ 19వ సీజన్ షూట్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ ఒకే వేదికపై కలిశారు. హోస్ట్ సాహిబా బాలి వీరిద్దరిని పరిచయం చేస్తున్న సమయంలో శుభ్‌మన్ గిల్ వెంటనే ఇషాన్ కిషన్‌ను ఉద్దేశించి ఫన్నీ కామెంట్ చేశాడు. "నేను కేవలం ఫుల్ కెప్టెన్లకే సలహాలు ఇస్తాను.. హాఫ్ కెప్టెన్లతో నాకు మాటలు లేవు" అంటూ శుభ్‌మన్ గిల్ నవ్వేశాడు.

Shubman Gill Trolls Ishan Kishan as Half Captain Ahead of IPL 2026 GT vs SRH Banter

'హాఫ్ కెప్టెన్' అని ఎందుకు అన్నాడు?
సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో తన వ్యక్తిగత కారణాల నేపథ్యంలో అందుబాటులో లేకపోవడంతో.. కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్ ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల అనంతరం ప్యాట్ కమిన్స్ జట్టుతో చేరగానే ఇషాన్ కిషన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే శుభ్‌మన్ గిల్ ఇషాన్ కిషన్‌ను "హాఫ్ కెప్టెన్" అని ఆటపట్టించాడు.

ఇషాన్ కిషన్ అదిరిపోయే కౌంటర్
శుభ్‌మన్ గిల్ సెటైర్లకు ఇషాన్ కిషన్ కూడా తనదైన స్టైల్లో బదులిచ్చాడు. "నాకు ఎవరి సలహాలు అవసరం లేదు. నాపై శుభ్‌మన్ గిల్ అస్సలు పరుగులు చేయలేడు" అని జోస్యం చెప్పాడు. దీనికి శుభ్‌మన్ గిల్ స్పందిస్తూ.. గుజరాత్ టైటాన్స్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఉన్న 1/6 చెత్త రికార్డును గుర్తుచేశాడు. వెంటనే ఇషాన్ అందుకుని.. హెడ్-టు-హెడ్ రికార్డులతో సంబంధం లేదు, ఇద్దరి దగ్గర సమానంగా ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి కదా.. అంటూ ముంబై ఇండియన్స్ ఇషాన్ గెలిచిన ట్రోఫీలను ఉద్దేశించి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

Story first published: Saturday, March 28, 2026, 13:45 [IST]
Other articles published on Mar 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+