Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: వావ్.. కోహ్లీ కూడా షాకయ్యాడు.. సూపర్ క్యాచ్ పట్టేసిన గిల్!

Shubman Gill takes a screamer and shocks everyone during INDvsBAN test

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అన్ని విభాగాల్లోనూ అదరగొడుతోంది. లోయర్ ఆర్డర్ పోరాటంతో భారీ స్కోరు చేసిన భారత జట్టు.. బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో అత్యుత్తమ ఆటతీరు కనబరిచింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాను ఆరంభంలోనే మహమ్మద్ సిరాజ్ దెబ్బతీశాడు. ఆ తర్వాత ఉమేష్ యాదవ్ కూడా అతనికి సహకరించాడు. పేసర్లు అందించిన ఆరంభాన్ని కుల్దీప్ యాదవ్ అందిపుచ్చుకొని నాలుగు వికెట్లతో బంగ్లా బ్యాటర్ల దుమ్ముదులిపాడు.

భారత బౌలర్లు చెలరేగడంతో 97 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో ముష్ఫికర్ రహీం, నురుల్ హసన్ ఉన్నారు. వాళ్లిద్దరే బంగ్లా లైనప్‌లో చివరి బ్యాటర్లు. ఇలాంటి సమయంలో మరోసారి బంతి కుల్దీప్ యాదవ్‌కు అందించాడు రాహుల్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కుల్దీప్ అనుకున్నాడు. అలాగే మంచి ఎగ్రెసివ్ ఫీల్డ్ ఏర్పాటు చేసిన రాహుల్.. శుభ్‌మన్ గిల్‌ను షార్ట్ లెగ్‌లో ఉంచాడు. ఈ క్రమంలో కుల్దీప్ వేసిన బంతిని నురుల్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో గాల్లోకి లేచిన బంతి నేలను తాకకముందే గిల్ క్యాచ్ పట్టేశాడు.

గిల్ అందుకున్న క్యాచ్ చూసి పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ కూడా ఆశ్చర్యపోయాడు. వీళ్లిద్దరూ కలిసి ఈ క్యాచ్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. టీమిండియాలో మంచి అథ్లెట్‌గా గిల్‌కు పేరుంది. తన కెరీర్‌లో ఎన్నో స్క్రీమర్ క్యాచులు అందుకున్నాడీ యువ క్రికెటర్. వీటిలో ఇప్పుడు నురుల్ హసన్ క్యాచ్ కూడా చేరింది. ఈ క్యాచ్ అతను అందుకుంటాడని నురుల్ కూడా ఊహించలేదు. అతను కూడా కాసేపు ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. ఇప్పుడు నెట్టింట గిల్ క్యాచ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా బ్యాటింగ్‌లో ఫెయిలైనా ఇలా ఫీల్డింగ్ చేసి జట్టులో స్థానం నిలుపుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Story first published: Thursday, December 15, 2022, 17:35 [IST]
Other articles published on Dec 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+