రియాలిటీ షోలోకి టీమిండియా కెప్టెన్ సోదరి! డైలాగ్స్ మామూలుగా లేవుగా!!
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్ త్వరలోనే ఓటీటీ ప్రపంచంలోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో తన రాబోయే రియాలిటీ షో 'ది ట్రేటర్స్ 2' కోసం సెలబ్రిటీల పూర్తి జాబితాను ప్రకటించింది. భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్ కూడా ఈ షోలో కంటెస్టెంట్‌గా కనిపించనుంది. షహనీల్ సాధారణంగా ప్రచారానికి, గ్లామర్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉంటుంది, కానీ ఈ షోలో ఆమె ప్రవేశం అందరినీ ఆశ్చర్యపరిచింది.
"నా పేరు గిల్.. ఎలా ఓడించాలో తెలుసు!"
గురువారం, 'ది ట్రేటర్స్ 2' ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో షహనీల్ గిల్ ఎంతో ఆత్మవిశ్వాసంతో "నా పేరు గిల్, అవతలి వారిని గేమ్‌లో ఎలా ఓడించాలో నాకు బాగా తెలుసు" అని పరిచయం చేసుకుంది. వృత్తిరీత్యా కంటెంట్ క్రియేటర్ అయిన షహనీల్, తన నిష్కపటమైన శైలి, సంభాషణలతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆశ్చర్యపరిచింది.

క్రికెట్‌కు, గ్లామర్‌కు చాలా కాలంగా సంబంధం ఉంది. కొద్ది నెలల క్రితమే క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ షో "లాకప్ అప్ సీజన్ 2"లో కనిపించారు. ఇప్పుడ, షహనీల్ గిల్ కూడా ఆమె బాటలోనే నడుస్తూ ఓటీటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్నారు.
ఆగష్టు 13 నుంచి ప్రసారం
'ది ట్రేటర్స్ సీజన్ 2' ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానుందని ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ షోకు మరోసారి ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆల్3మీడియా వారి అంతర్జాతీయ ఫార్మాట్‌కు భారతీయ అనుసరణగా రూపొందిన ఈ సిరీస్‌ను ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.
21 మంది స్టార్ సెలబ్రిటీలతో మైండ్ గేమ్!
ఈ షోలో మల్లికా షెరావత్, మునవర్ ఫరూఖీ, రియా చక్రవర్తి, క్రిస్టిల్ డిసౌజా, పారుల్ గులాటీ, ప్రముఖ చెఫ్ రణవీర్ బ్రార్, ప్రముఖ నటుడు దలీప్ తాహిల్, హర్మాన్ సింఘా, తాన్యా పూరి వంటి స్టార్‌లతో షహనీల్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. పోటీదారుల మొదటి బ్యాచ్‌లో యూట్యూబర్‌లు అభిషేక్ మల్హాన్, షాలినీ పాసి, కుల్లు, శ్వేతా తివారీ, రిదా తరానా, అన్ష్ చోప్రా, రాపర్ ఇక్కా, ప్రిష్, సౌందాస్ మౌఫ్కిర్, కరణ్ సింగ్ మ్యాజిక్, సాహిల్ సలాథియా కూడా ఉన్నారు. ఈ సీజన్‌లో మొత్తం 21 మంది సెలబ్రిటీ పోటీదారులు టైటిల్, ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి ఒక కఠినమైన సైకలాజికల్ గేమ్ ఆడనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

