Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ పనికి.. చేతులు జోడించి వేడుకున్న గిల్ సోదరి! (వీడియో)

IPL 2025 Rajasthan Royals: ఐపీఎల్ 2025లో భాగంగా సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా తాజాగా జరిగిన కీలక మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గిల్ సేన్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. 209 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లు తుస్సు మనిపించారు. అలానే రాజస్థాన్ ప్లేయర్లు పేలవ ఫీల్డింగ్ చేసి ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నారు.

వాస్తవానికి ఈ మ్యాచులో దూకుడు మీదున్న సాయి సుదర్శన్ ను పెవిలియన్ పంపే అవకాశం రాజస్థాన్ కు వచ్చింది. కానీ సిమ్రాన్ హెట్మేయర్.. సుదర్శన్ ఇచ్చిన ఈజీ క్యాచును అందుకోలేకపోయాడు. ఆ తర్వాత 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా.. గిల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచును పట్టుకోలేకపోయాడు. అలా గుజరాత్ బ్యాటర్లకు లైఫ్ దక్కింది. ఆ తర్వాత వారిద్దరి చెలరేగి ప్రదర్శన చేశారు.

Shubman Gill sister prayer by folding hands after Vaibhav suryavanshi drops gill catch in RR vs GT

ఆ జాబితాలో ఆఖరి స్థానంలో...
అయితే రాజస్థాన్ ఈ మ్యాచులోనే కాదు ఇతర మ్యాచుల్లోనూ చెత్త ఫీల్డింగ్ చేసింది. ఎన్నో కీలక క్యాచులను మిస్ డ్రాప్ చేసింది. దీంతో ఈ సీజన్ లో వరస్ట్ క్యాచ్ ఎఫీషియన్స్ 62.5 శాతం నమోదు చేసింది. ఈ క్యాచ్ ఎఫీషియన్సి జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(82.1), ముంబై ఇండియన్స్ (80.0), సన్ రైజర్స్ హైదరాబాద్ (76.9), కోల్ కతా నైట్ రైడర్స్ (74.0), పంజాబ్ కింగ్స్ (72.5), గుజరాత్ టైటాన్స్ (71.9), లక్నో సూపర్ జెయింట్స్ (71.4), దిల్లీ క్యాపిటల్స్ (70.8), చెన్నై సూపర్ కింగ్స్ (63.3) ఒకటి నుంచి 9వ స్థానం వరకు వరుసగా ఉన్నారు.

చేతులు జోడించిన వేడుకున్న గిల్ సోదరి..
ఈ మ్యాచులో శుభ్‌మన్‌ గిల్‌ (84: 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే దూకుడు మీదున్న అతడిని పెవిలినయన్ కు పంపే ఛాన్స్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వచ్చింది. కానీ గిల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచును అతడు పట్టుకోలేక చేజార్చాడు. దీంతో రాజస్థాన్ అభిమానులు రాజస్థాన్ టీమ్ తో పాటు వైభవ్ క్యాచ్ మిస్ ను విమర్శించారు. ఈ సంఘటన జీటీ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మూడో బంతికి జరిగింది. రియాన్ పరాగ్ లెగ్ స్టంప్ మీదగా.. షార్టర్ లెంగ్త్ బాల్ వేయగా.. గిల్ పుల్ స్ట్రోక్ ఆడబోయాడు. కానీ బంతి స్క్వేర్ లెగ్ ఏరియా మీదగా వెళ్లింది. సూర్యవంశీ పరుగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేయబోయాడు. కానీ బంతిని ఒడిసి పట్టుకోలేకపోయాడు. ఆ సమయంలో స్టాండ్స్ లో ఉన్న గిల్ సోదరి.. రెండు చేతులతో వేడుకుంటూ కనిపించింది. తన సోదరుడు గిల్ ఔట్ కాకూడదని, ఇన్నింగ్స్ కొనసాగించేలా చేయాలని దేవుడిని ప్రార్థించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Story first published: Tuesday, April 29, 2025, 6:05 [IST]
Other articles published on Apr 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+