ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని టీమిండియా ఘనంగా ఆరంభించింది. తాజాగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో షమీ 5 వికెట్లతో చెలరేగి ఆడగా.. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ అదిరే శతకంతో మెరిశాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు శుభ్‌మన్ గిల్. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన మెసేజ్ గురించి తెలిపాడు.
"నేను ఆడిన అత్యంత సంతృప్తికరమైన ఇన్నింగ్స్‌లలో ఇదీ ఒకటి. ఐసీసీ ఈవెంట్లలో నా తొలి సెంచరీ. నా ప్రదర్శనతో చాలా చాలా ఆనందంగా ఉన్నాను. నేను, రోహిత్ భాయ్ క్రీజులోకి వెళ్లినప్పుడు.. ఆఫ్ స్టంప్ వెలుపల ఉన్న బంతులు బ్యాట్‌పైకి రాకపోవడంతో బంతిని కట్ చేయడం అంత సులభం కాదని భావించాం. అందుకే నేను ఫాస్ట్ బౌలర్లపై ముందుకు వెళ్లి ఆడటానికి ప్రయత్నించాను. ఆ తర్వాత స్పిన్నర్లు వచ్చినప్పుడు, ఫ్రంట్ ఫూట్ తో సింగిల్స్ తీయడం అంత సులువు కాదని నేను కోహ్లీ మాట్లాడుకున్నాం.

అందుకే బ్యాక్ ఫూట్ తో సింగిల్స్ తీసేందుకు ప్రయత్నించాం. ఓ దశలో మాపై కాస్త ఒత్తిడి ఏర్పడింది. అప్పుడు ఓ బ్యాటర్ చివరి వరకు క్రీజులో ఉండి బ్యాటింగ్ చేయాలని డ్రెస్సింగ్ రూమ్ నుంచి సందేశం వచ్చింది. నేను అదే చేశాను. ఇక నేను బాదిన రెండు సిక్స్ లలో మొదటి నాలో చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. రెండోది నేను సెంచరీ దగ్గర అవ్వడానికి తోడ్పడింది. ఫైనల్ గా రెండు నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి." అని మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి గిల్ హర్షం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ సాగిందిలా..
బంతితో షమి (5/53), బ్యాటుతో శుభ్‌మన్ గిల్ (129 బంతుల్లో 9×4, 2×6 సాయంతో 101 నాటౌట్) అద్భుతంగా రాణించి.. బంగ్లాదేశ్ పై భారత జట్టు గెలవడంలో కీలకంగా వ్యవహరించారు. షమితో పాటు హర్షిత్ రాణా (3/31), అక్షర్ పటేల్ (2/43) కూడా చెలరేగి ఆడారు. దీంతో బంగ్లాదేశ్.. 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటర్లలో హృదోయ్ (118 బంతుల్లో 6×4, 2×6 సాయంతో 100), జేకర్ అలీ (114 బంతుల్లో 4×4 సాయంతో 68) సెంచరీలో మెరవడంతో బంగ్లా ఆ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్యాన్ని 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. ఇక తన తర్వాతి మ్యాచ్ ను ఆదివారం పాకిస్థాన్‌తో పోటీపడనుంది.
For his magnificent unbeaten 1️⃣0️⃣1️⃣, Shubman Gill is the Player of the Match 👏🏆#TeamIndia win #BANvIND and register 2 points 👌
— BCCI (@BCCI) February 20, 2025
Scorecard ▶️ https://t.co/ggnxmdG0VK#ChampionsTrophy | @ShubmanGill pic.twitter.com/ID5C8S2z1U