న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద్రవిడ్ సర్ ఇచ్చిన సూచనలే పాటిస్తున్నా.. అదే నా విజయ రహస్యం!!

Shubman Gill reveals the basic advice given to him by Coach Rahul Dravid

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సర్ ఇచ్చిన సూచనలే పాటిస్తున్నా. అదే నా విజయ రహస్యం అని పంజాబ్‌ యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ తెలిపాడు. అండర్‌-19 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించాడు. గత ఐపీఎల్-12లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున సత్తా చాటుకున్నాడు. ఇక వెస్టిండీస్‌-ఏతో జరిగిన అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారించిన గిల్.. వెస్టిండీస్‌ పర్యటనకు మాత్రం ఎంపిక కాలేదు. అయితే త్వరలోనే గిల్ టీమిండియాకు ఆడుతాడనే మాజీలు అభిప్రాయపడ్డారు. అంతేకాదు తన్ని భవిష్యత్‌ ఆశాకిరణంగా పేర్కొంటున్నారు.

<strong>రోహిత్, అశ్విన్‌కు దక్కని చోటు.. కోహ్లీపై విమర్శల వర్షం</strong>రోహిత్, అశ్విన్‌కు దక్కని చోటు.. కోహ్లీపై విమర్శల వర్షం

ఆ సూచనలే పాటిస్తున్నా:

ఆ సూచనలే పాటిస్తున్నా:

శుభ్‌మన్‌ గిల్‌ మరో రెండు వారాల్లో 20వ పడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తన అభిప్రాయాలను, అనుభవాలను గురువారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'అండర్‌-19, భారత్-ఏకు ఆడుతున్నప్పటి నుంచి ద్రవిడ్‌ సర్‌ నా కోచ్‌. ఆయన చెప్పిన ఓ సలహా నేనేప్పటికీ గుర్తుంచుకుంటా. పరిస్థితులు ఏవైనా సరే.. నా సహజ ఆటతీరును ఎన్నటికీ మార్చుకోవద్దని చెప్పారు. బ్యాటింగ్‌లో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా.. ప్రాథమిక ఆటను మాత్రం మార్చుకోవద్దన్నారు. ఆ సూచనలే పాటిస్తున్నా' అని గిల్ చెప్పారు.

 అదే నా కెరీర్‌లో అత్యుత్తమం:

అదే నా కెరీర్‌లో అత్యుత్తమం:

'మణికట్టుతో ఆడే డ్రైవ్‌ అచ్చం విరాట్‌ కోహ్లీ లాగే ఉంటుంది కదా ఇది ఎక్కడ నేర్చుకున్నావని అడగ్గా.. 'ఆ షాట్ సహజంగానే వచ్చింది. స్పిన్నర్లపై దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తా. టర్నర్లు ఆడేటప్పుడు అలా అలవాటైంది. పేస్‌ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు బ్యాక్‌ఫుట్‌తో ఆడతా. వెస్టిండీస్‌-ఏపై చేసిన డబల్ సెంచరీ నా కెరీర్‌లో అత్యుత్తమం. దక్షిణాఫ్రికా-ఏపైనా శతకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా' అని గిల్ పేర్కొన్నాడు.

'సెంచరీ కోసం కాదు.. జట్టు కోసమే ఆలోచిస్తా'

యువీ దగ్గరే నేర్చుకున్నా:

యువీ దగ్గరే నేర్చుకున్నా:

'యువరాజ్‌ సింగ్‌ ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు. ఒత్తిడిని జయించేందుకు..పేరు, ప్రతిష్ఠలతో పక్కదారి పట్టకుండా ఎలా ఉండాలో యువీ దగ్గరే నేర్చుకున్నా. పంజాబ్‌ జట్టులో నా సీనియర్‌ గురుకీరత్‌ సింగ్‌ మన్‌తో ఎక్కువగా గడుపుతా. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నాన్ననే అడుగుతా' అని గిల్ చెప్పుకొచ్చాడు. ఫిట్‌నెస్ విషయంలో సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలే స్ఫూర్తి అని గిల్ తెలిపాడు.

Story first published: Friday, August 23, 2019, 13:13 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X