Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : సెంచరీలు చేయడం అలా నేర్చుకున్నా: శుభ్‌మన్ గిల్

Shubman Gill reveals his batting change in recent times

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కూడా అద్భుతమైన సెంచరీ సాధించాడు. అయితే అతను ఇంతకుముందు ఇంత ఈజీగా సెంచరీలు చేయగలిగేవాడు కాదు. తనకు దక్కిన మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలుచుకోలేడు అనేదే అతనిపై వినిపించిన ప్రధాన కంప్లయింట్ కూడా. ఆస్ట్రేలియా గడ్డపై కూడా సూపర్‌గా ఆడినా సెంచరీ చేయలేదు.

సెంచరీలు చేయని గిల్..

సెంచరీలు చేయని గిల్..

గిల్ 2021 ఫిబ్రవరి నుంచి 2022 జూలై వరకు మొత్తం 8 టెస్టులు ఆడాడు. కానీ వీటిలో ఒక్క శతకం కూడా లేదు. ఈ మ్యాచులన్నింట్లో కలిపి 22.85 సగటుతో 320 పరుగులు మాత్రమే చేశాడు. ఇలాంటి సమయంలో గతేడాది చివర్లో బంగ్లాదేశ్ పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో ఆడలేదు.

దీంతో గిల్‌కు ఈ సిరీస్‌లో అవకాశం దక్కింది. ఈ ఛాన్స్‌ను రెండు చేతులతో అందిపుచ్చుకున్న గిల్ అక్కడ సెంచరీ చేశాడు. అది అతని కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీ. అక్కడి నుంచి గిల్ మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోలేదు.

అతి జాగ్రత్త వల్లే అవుటయ్యా..

అతి జాగ్రత్త వల్లే అవుటయ్యా..

ఇలా తన కెరీర్ ఆరంభంలో భారీ స్కోర్లు చేయలేకపోవడం గురించి గిల్ స్పందించాడు. అహ్మదాబాద్ టెస్టు అనంతరం మాట్లాడిన అతను తన కెరీర్‌లో అది ఒక దశ అని చెప్పాడు. 'నా కెరీర్‌లో అదొక దశ. అప్పుడు నేను 40లు, 50లు చేశాను. ఇంగ్లండ్‌లో ఒక మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేశా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఎక్కువ పరుగులు చేయలేదు.

క్రీజులో సెట్ అయిన తర్వాత మరీ డిఫెన్సివ్‌గా ఆడుతున్నానని నాకు అర్థమైంది. నాకు దొరికే ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చే ప్రయత్నంలో మరీ అతి జాగ్రత్తగా ఆడటం మొదలు పెట్టా' అని వివరించాడు.

అలా మార్చుకున్నా..

అలా మార్చుకున్నా..

ఇలా తనపై తనే మరీ ఒత్తిడి పెంచుకున్నానని, దీంతో తన సహజమైన ఆట ఆడకుండా వేరేలా ఆడాల్సి వచ్చిందని చెప్పాడు. 'అది నా ఆట కాదు. నేను సెట్ అయితే నా రిథమ్ అందుకుంటా. కానీ నా న్యాచురల్ గేమ్ ఆడకపోవడంతో అవుట్ అవుతున్నా. ఈ టైంలో నేను అవుటైన ప్రతిసారీ డిఫెన్స్ చేసుకుంటూనే అవుటయ్యా.

ఏదైనా షాట్ ఆడుతూ అవుటైతే ఓకే. కానీ నా సహజమైన ఆట ఆడకుండా అవుటవడం మాత్రం అస్సలు నచ్చలేదు. అదే నా మానసిక పరిస్థితి. అందుకే ఫ్రీ ఫ్లోయింగ్ పద్ధతిలో ఆడాలని నాకు నేను చెప్పుకుంటూ ఉన్నా' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, March 12, 2023, 10:20 [IST]
Other articles published on Mar 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+