మ్యాచ్‌కే హైలైట్! స్టార్క్‌ షార్ట్ పిచ్ బంతికి.. గిల్ ఎలా సమాధానం ఇచ్చాడో చూడండి (వీడియో)

బ్రిస్బేన్‌: బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో ‌గిల్ ‌(91: 146 బంతుల్లో 8x4, 2x6) ఔటయ్యాడు. 48వ ఓవర్‌ చివరి బంతికి స్లిప్‌లో స్టీవ్‌ స్మిత్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు చేటేశ్వర్ పుజారాతో కలిసి గిల్‌ రెండో వికెట్‌కు 114 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించాడు.

మ్యాచ్‌కే హైలైట్:

బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లోనే 21 ఏళ్ల శుభ్‌మన్‌ గిల్‌ టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. మూడో టెస్టు ఆడుతున్న గిల్‌ని భయపెట్టేందుకు ఆసీస్ స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్ గంటకి సుమారు 140 కిమీ పైగా వేగంతో పదేపదే షార్ట్ పిచ్ బంతుల్ని సంధించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని గిల్.. షార్ట్ పిచ్ బంతులకి తనదైన శైలిలో బదులిచ్ఛాడు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో అతను కొట్టిన ప్లాట్ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

అప్పర్ కట్ షాట్:

ఇన్నింగ్స్ 38వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. ఓ బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా షార్ట్ పిచ్ బంతిని సంధించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తరహాలో శుభమన్ గిల్ అప్పర్ కట్ ఆడాడు. బ్యాట్‌కి బాల్ సరిగ్గా కనెక్ట్ అవడంతో.. థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లి స్టాండ్స్‌లో పడింది. స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని ఆ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. అయితే థర్డ్ మ్యాన్ దిశగా అప్పుడే ఓ ఫీల్డర్‌ని స్టార్క్ ఉంచాడు. అయినా కూడా ఏమాత్రం తడబాటు లేకుండా గిల్ సూపర్ షాట్ ఆడాడు. అతడు కొట్టిన సిక్స్‌కి ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక మ్యాచ్ కామెంటేటర్లు ఫిదా అయిపోయారు.

ఒకే ఓవర్లో 20 రన్స్:

ఒకే ఓవర్లో 20 రన్స్:

46వ ఓవర్లో కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లోలెగ్ సైడ్ దిశగా శుభమన్ గిల్ మరో భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి 142 కిమీ వేగంతో స్టార్క్ సంధించాడు. ఏ ఓవర్లోనే మరో మూడు బౌండరీలు బాది మొత్తంగా 20 రన్స్ పిండుకున్నాడు. దీంతో స్టార్క్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యాడు. సీనియర్ ఆటగాడు చేటేశ్వర్ పుజారా షార్ట్ పిచ్ బంతుల్ని వదిలేస్తున్నా.. శుభమన్ గిల్ మాత్రం సాహసోపేతంగా కొన్ని బంతుల్ని హిట్ చేసే ప్రయత్నం చేశాడు. కట్ షాట్లతో పాటు కవర్ డ్రైవ్‌లతోనూ అదరగొట్టాడు.అయితే ఆడే క్రమంలో వికెట్ కోల్పోయాడు.

టీ బ్రేక్ సమయానికి:

టీ బ్రేక్ సమయానికి:

రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 167 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది. కెప్టెన్‌ అజింక్య రహానే (24) ధాటిగా ఆడే క్రమంలో పాట్ కమిన్స్‌ వేసిన 56.5 ఓవర్‌కు కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో పుజారా (43), పంత్‌ (10) ఉన్నారు. భారత్‌ 63 ఓవర్లు పూర్తయ్యేసరికి 183/3తో కొనసాగుతోంది. విజయానికి ఇంకా 145 పరుగుల దూరంలో నిలిచింది. ప్రస్తుతం టీ బ్రేక్.

Brisbane Test: పాపం శుభమన్‌ గిల్.. తృటిలో సెంచరీ మిస్!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, January 19, 2021, 10:38 [IST]
Other articles published on Jan 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X