టీ20 వరల్డ్ కప్ అనంతరం శుభ్‌మన్ గిల్‌కు వరుసగా బంపరాఫర్‌లు తగులుతున్నాయి. జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా తాత్కాలిక బాధ్యతలు అందుకున్న గిల్.. పూర్తి స్థాయిలో వన్డే, టీ20 జట్లకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక టెస్టుల్లోనూ గిల్‌కు ఉప సారథి బాధ్యతలు అందుతాయో లేదో తెలియాలంటే మరో వారం ఎదురుచూడాలి. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఈ బంగ్లా సిరీస్‌కు ఎంపిక చేసే భారత జట్టుతో గిల్ అన్ని ఫార్మాట్లలో వైస్ కెప్టెన్సీ గురించి క్లారిటీ వస్తుంది. అయితే టెస్టుల్లో తనపై నెలకొన్న అంచనాలకు అందుకోవడంలో విఫలమయ్యానని గిల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఇండియా-ఏ జట్టుకు సారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టులో తన ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ గురించి మాట్లాడాడు.

''అవును, టెస్టు క్రికెట్‌లో అంచనాలను అందుకోలేకపోతున్నాను. అయితే ఈ సీజన్‌లో మేం పది టెస్టులు ఆడనున్నాం. ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత నాపై ఉన్న అంచనాలను అందుకుంటానని లేదా అంతకుమించిన ప్రదర్శన చేస్తానని ఆశిస్తున్నాను'' అని గిల్ అన్నాడు. టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా కెరీర్‌ను ఆరంభించిన గిల్ ఆ తర్వాత పుజారా మూడో స్థానంలో ఆడుతున్నాడు. దీని కోసం స్పిన్‌లో తీవ్రంగా సాధన చేశానని తెలిపాడు.
''స్పిన్నర్లను సమర్థవంతంగా డిఫెండ్ చేయడానికి నేను తీవ్రంగా శ్రమించాను. టర్న్ అయ్యే పిచ్‌లపై మరింత డిఫెండ్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్లీ ట్రాక్‌లపై టీ20లు, వైట్ బాల్ సిరీస్‌లు ఎక్కువగా ఆడటం వల్ల డిఫెన్సివ్ గేమ్‌కు కాస్త దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దీనిపైనే ఎక్కువ ఫోకస్ చేశాను'' అని గిల్ అన్నాడు.
''ఇక కెప్టెన్ అయినా, కాకపోయినా ప్రతి మ్యాచ్, సిరీస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అయితే సారథిగా, జట్టులో ఇతర ప్లేయర్ల గురించి ఎంతో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓ ఆటగాడి నుంచి 100 శాతం ప్రదర్శన కోరుకుంటే.. ఆ ప్లేయర్‌తో కనెక్టై ఉండాలి. వాళ్ల బలాబలాలు తెలుసుకోవాలి. కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా ఆటగాళ్లతో ఎక్కువగా సంభాషణలు జరపాలి. ఇది కష్టం, సులువు అని కాదు. జట్టులో ఎన్నో ఏజ్ గ్రూప్‌లు ఉండటంతో ఇది సరదాగా ఉంటుంది'' అని గిల్ పేర్కొన్నాడు.