కౌంటీల్లో అరంగేట్రానికి సిద్ధమైన శుభ్‌మాన్ గిల్.. ఈ ఏడాది ఏడో భారత ప్లేయర్‌గా

ఇంగ్లాండ్‌లోని కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. అతను కౌంటీల్లోని గ్లామోర్గాన్ జట్టు తరఫున ఆడడానికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. ఇక వీసా క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఇకపోతే గ్లామోర్గాన్ క్లబ్ ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.. కానీ అందుతున్న నివేదికల ప్రకారం.. 2022లో మిగిలిన సీజన్ పాటు గిల్ గ్లామోర్గన్ తరఫున ఆడడం లాంఛనమే అని తెలుస్తోంది. గిల్ గనుక కౌంటీల్లో అరంగేట్రం చేస్తే ప్రస్తుత సీజన్‌లో కౌంటీల్లో ఆడేందుకు అగ్రిమెంట్ చేసుకున్న ఏడో భారత బ్యాటర్‌గా శుభ్‌మాన్ నిలుస్తాడు.

ఇప్పటికే కౌంటీల్లో ఆడుతున్న భారత ప్లేయర్లు
ఇకపోతే శుభ్‌మాన్ గిల్ కంటే ముందే.. చెతేశ్వర్ పుజారా (ససెక్స్), వాషింగ్టన్ సుందర్ (లంకాషైర్), కృనాల్ పాండ్యా (రాయల్ లండన్ కప్ కోసం వార్విక్‌షైర్), మహ్మద్ సిరాజ్ (వార్విక్షైర్ ఫర్ కౌంటీ ఛాంపియన్‌షిప్), ఉమేష్ యాదవ్ (మిడిల్‌సెక్స్), నవదీప్ సైనీ (కెంట్) ఇప్పటికే తమ అగ్రిమెంట్లు పూర్తి చేసుకున్నారు. వీరిలో పుజారా, సుందర్, పాండ్యా, ఉమేష్ యాదవ్, సైని ఇప్పటికే తమ అరంగేట్రం కూడా పూర్తి చేశారు. ఇక కౌంటీల్లో భారత ప్లేయర్లు అందరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనతో అలరిస్తున్నారు.

రెండో టెస్ట్ జట్టు కోసం ద్రావిడ్ ప్రోద్బలమా..?
ఇక కౌంటీల్లో భారత ప్లేయర్లు ఆడడానికి రాహుల్ ద్రావిడ్ ప్రోద్బలం ఉన్నట్లు సమాచారం. అయితే ఎంతవరకు కరెక్టో చెప్పలేము.. ఇప్పటికే భారత్ తరఫున రెండు వైట్ బాల్స్ జట్లు ఉన్నాయి. ఇదే రకంగా.. భారత్‌కు రెండో నిఖార్సైన టెస్ట్ జట్టును తయారుచేసే పనిలో రాహుల్ ద్రావిడ్ ఉన్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్లేయర్లు మాత్రం తమ టచ్ కోల్పోకుండా ఉండడానికి.. అలాగే తిరిగి జాతీయ జట్టుకు ఎంపికవ్వడానికే కౌంటీల్లో ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ లాంటి పిచ్‌లపై రాణిస్తే.. తప్పకుండా వారి ఆట చాలా మెరుగుపడుతుంది.

రవిశాస్త్రి, గంగూలీ తర్వాత మూడో బ్యాటర్‌గా గిల్
ఇకపోతే గతంలో రవిశాస్త్రి (1987-91), సౌరవ్ గంగూలీ (2005) తర్వాత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లామోర్గాన్ తరఫున ఆడిన మూడో భారతీయుడుగా శుభ్ మాన్ గిల్ నిలువనున్నాడు. ఇటీవల వెస్టిండీస్, జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లలో శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన ఫామ్ కనబర్చిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో 102.50సగటుతో 205పరుగులు, జింబాబ్వే పర్యటనలో 122.50సగటుతో 245పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు గిల్ 11టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 30.47సగటుతో 579పరుగులు చేశాడు. జులైలో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో గిల్ రెండు ఇన్నింగ్స్‌లలో 17, 4పరుగులు చేసి విఫలమయ్యాడు. ఇక డొమెస్టిక్ క్రికెట్లో రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున 12 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన గిల్ 65.33 సగటుతో 1176 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications