స్టార్ క్రికెటర్‌గా శుభమాన్ గిల్: టోర్నీ రికార్డులను పరిశీలిస్తే అదే నిజం

హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్... అంతర్జాతీయ క్రికెట్‌లో భవిష్యత్తు క్రికెటర్లను తీర్చిదిద్దే టోర్నీ. ఈ టోర్నీలో సత్తా చాటిన యువ క్రికెటర్లు తమ దేశాల తరుపున జాతీయ జట్టులో చోటు దక్కుతుంది. అండర్-19 వరల్డ్ కప్‌లో రాణించిన ఎంతో మంది క్రికెటర్లు ప్రస్తుతం తమ దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్ తదితరులు. ఆస్ట్రేలియా వేదికగా 1998లో యూత్ వరల్డ్‌కప్‌గా ప్రారంభమైన ఈ టోర్నీ ఆ తర్వాత అండర్-19 వరల్డ్ కప్‌గా రూపాంతరం చెందింది. న్యూజిలాండ్ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పృథ్వీ షా నేతృత్వంలోని భారత యువ జట్టు విజేతగా నిలిచింది.

2000వ సంవత్సరంలో యువరాజ్
తద్వారా గతంలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో నాలుగోసారి వరల్డ్ కప్ నెగ్గిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అలాంటి టోర్నీలో రాణించిన వారికి తమ దేశాలు బ్రహ్మరథం పడుతుంటాయి. ఈ టోర్నీ ద్వారా అనేక మంది కుర్రాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు సాధించారు. ఈ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ప్రతి కుర్రాడు స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. గత 18 ఏళ్లుగా ఈ టోర్నీ రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

2000వ సంవత్సరంలో యువరాజ్
2000 సంవత్సరంలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో భారత్ తొలి ప్రపంచకప్ సాధించింది. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని అందుకున్నాడు. ఆ తర్వాత యువీ క్రికెట ప్రస్థానం ఎలా ఉందో మనకు తెలిసిందే. అంతేకాదు 2011 వరల్డ్ కప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలవడంతో యువీ కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు.

2004లో శిఖర్ ధావన్
ఇక, 2002లో జింబాంబ్వే స్టార్ క్రికెటర్ టాటెండా టైబు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. అతడు కూడా తన దేశం తరుపున స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. 2004లో ప్రస్తుత టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఆ తర్వాత 2006లో జరిగిన వరల్డ్ కప్‌లో టెస్టు స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. వీరిద్దరూ కూడా ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.

2014లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ మర్క్రమ్
2008లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ టిమ్ సౌథీ, 2010లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిక్స్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్నారు. 2012లో జరిగిన టోర్నీలో ఆస్ట్రేలియా క్రికెటర్ విలియమ్ బోసిస్టో అందుకోగా 2014లో ప్రస్తుత దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న మర్క్రమ్ మ్యాన్ ఆఫ్ టోర్నీగా నిలిచాడు.
2018లో శుభమాన్ గిల్
2016లో బంగ్లాదేశ్ క్రికెటర్ మెహిదీ హసన్ ఈ ఘనతను సోంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెహిదీ హాసన్ బంగ్లా క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో భారత యువ క్రికెటర్
శుభమాన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. దీంతో గత రికార్డులను పరిశీలిస్తే శుభమాన్ గిల్ త్వరలోనే జాతీయ జట్టు తరుపున ఆడే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications