Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లేడీ ఫ్యాన్‌ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ (Video)

గుజరాట్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సొంతమైదానంలో అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ టైటాన్స్ 17.3 ఓవర్లో 89 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (31; 24 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్.

ముకేశ్ కుమార్ (3/14) మూడు వికెట్లతో సత్తాచాటాడు. గుజరాత్ జట్టులో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. రషీద్‌తో పాటు సాయి సుదర్శన్ (12; 9 బంతుల్లో, 2x4), రాహుల్ తెవాతియా (10; 15 బంతుల్లో, 1x4) సింగిల్ డిజిట్ దాటారు. కాగా, ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

Shubman Gill Loses Composure Over the Beauty of a Lady Fan Video goes viral

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది.
ఢిల్లీ బ్యాటర్లలో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (20; 10 బంతుల్లో, 2x4, 2x6), షై హోప్ (19; 10 బంతుల్లో, 1x4, 2x6), రిషభ్ పంత్ (16*; 11 బంతుల్లో, 1x4, 1x6), అభిషేక్ పోరెల్ (15; 7 బంతుల్లో, 2x4, 1x6), సుమిత్‌ (9*; 9 బంతుల్లో, 2x4) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ ఓ వికెట్ తీశారు.

అయితే గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ రియాక్షన్ వైరల్‌గా మారింది. అంతేగాక గిల్ చేసిన పనికి విమర్శలు కూడా వస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. సాధారణంగా స్టేడియంలో స్క్రీన్‌పై ఫ్యాన్స్‌ను తరుచూ చూపిస్తుంటారు. ఐపీఎల్‌లో లేడీ ఫ్యాన్స్‌పై కెమెరామెన్ కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అదే తరహాలో గుజరాత్ బ్యాటింగ్ సమయంలో కెమెరామెన్ ఓ అందమైన యువతిని స్క్రీన్‌పై చూపించాడు.

ఆ లేడీ ఫ్యాన్‌ను చూసిన గిల్ తాను ఫిదా అయిపోయినట్లుగా, అమ్మాయి అందానికి పడిపోయినట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. దీంతో ఇదేం పని అంటూ గిల్‌ను నెటిజన్లు విమర్శిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ ఉంచుకుని ఇతరుల వైపు చూడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు యువతిని చూసి గిల్ అలా రియాక్ట్ అవ్వలేదని, రివ్యూ రిజల్ట్‌ను చూసి స్పందించాడని కొందరు వివరణ ఇస్తున్నారు.

Story first published: Thursday, April 18, 2024, 10:30 [IST]
Other articles published on Apr 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+