For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అద్భుతంగా ఆడాడు.. భారత ఓపెనర్‌పై కమిన్స్‌ ప్రశంసలు!!

Shubman Gill looked good in his first Test says Pat Cummins
Ind vs Aus 2020 : Australia Star Pacer Pat Cummins praises Team India India Opener

మెల్‌బోర్న్‌: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌పై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఆడింది తొలి టెస్ట్ మ్యాచే అయినా అద్భుతంగా ఆడాడని పేర్కొన్నాడు. రెండవ టెస్టులో భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవడంలో తనకెలాంటి ఆశ్చరం కలిగించలేదన్నాడు. ప్రతీ ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని, తమ బ్యాట్స్‌మెన్‌ తిరిగి ఫాంలోకి వస్తారనే నమ్మకం ఉందని‌ కమిన్స్‌ ధీమా వ్యక్తం చేశాడు. బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా చేతిలో 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.

బుధవారం పాట్ కమిన్స్‌ వర్చువల్ మీడియా సమావేశంలో పాల్గొని పలు విషయాలు చర్చించాడు. 'శుభ్‌మన్‌ గిల్‌ తన మొదటి టెస్టులో బాగా ఆకట్టుకున్నాడు. అతడు ఆడింది తొలి టెస్ట్ మ్యాచే అయినా.. అద్భుతంగా ఆడాడు. చాలా ప్రశాంతమైన వ్యక్తి. అతడు కోరుకున్న విధంగానే ఆడాడు. అయితే బాగా ఆడడం ఒక్కోరోజు కుదురుతుంది, మరోరోజు కుదరదు' అని కమిన్స్‌ చెప్పాడు. 'తొలి టెస్ట్ ఓటమి తర్వాత భారత్ బలంగా పుంజుకుంటుందని తెలుసు. ఓ స్థాయిలో ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలా గర్వంగా ఫిల్ అవుతారు. భారత ప్రతీకారం తీర్చుకోవడంలో ఎలాంటి ఆశ్చరం కలిగించలేదు' అని ఆసీస్ పేసర్ చెప్పుకొచ్చాడు.

'మా టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. తిరిగి ఫాంలోకి వస్తారు. గత పన్నెండేళ్లుగా స్టీవ్‌ స్మిత్ చాంపియన్‌గానే ఉన్నాడు. ప్రతీ ఆటగాడి జీవితంలో ఎత్తుపళ్లాలు ఉంటాయి. తను ఒక్కసారి నిలదొక్కుకుంటే చాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మేం ఆడింది కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఒక్క ఓటమికే కుంగిపోవాల్సిన అవసరం లేదు' అని కమిన్స్ తెలిపాడు. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరితే మరింత బలం చేకూరుతుందన్నాడు.

స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఒక్కరు కూడా కనీసం అర్ధ సెంచరీ చేయకపోవడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా 1988లో డిసెంబరు 24 నుంచి 29 వరకు ఎంసీజీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ అర్ధ సెంచరీ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 285 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఆసీస్‌ మాజీ కెప్టెన్‌, ఈ దశాబ్దపు టెస్టు ప్లేయర్‌( టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ది డికేడ్‌)గా నిలిచిన స్టీవ్‌ స్మిత్‌ రెండు టెస్టుల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.

Story first published: Wednesday, December 30, 2020, 15:47 [IST]
Other articles published on Dec 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+