Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: ప్రిన్స్ డకౌట్ అంటూ స్లెడ్జింగ్.. ప్రతీకారం కోసం గిల్ వెయిటింగ్

సచిన్ టెండూల్కర్‌ను క్రికెట్ గాడ్ అని, విరాట్ కోహ్లిని కింగ్ అని అలాగే యువ ప్లేయర్ శుభ్‌మన్గిల్‌ను ప్రిన్స్‌గా అభిమానులు పిలుస్తుంటారు. సచిన్, కోహ్లికి సరైన వారసుడిగా గిల్ కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో నిలకడైన ఆటతో ప్రశంసలు పొందుతున్నాడు.

అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో గిల్ డకౌటయ్యాడు. పేసర్ లిజాద్ విలియమ్స్ ఇన్ స్వింగర్‌తో గిల్ ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే వికెట్ సాధించిన అనంతరం విలియమ్స్ అతిగా ప్రవర్తించాడు. ప్రిన్స్ ను ఔట్ ఈజీగా ఔట్ చేసినట్లు సింబాలిక్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

Shubman Gill: Lizaad Williams Sledging as prince duckout. Gill waiting for revenge

అయితే భారీ అంచనాలు ఉండటంతోనే గిల్ ఒత్తిడిలోకి వెళ్లి తొందరగా ఔట్ అవుతున్నాడని, ఇన్ స్వింగర్ బంతుల్లో ఎక్కువగా పెవిలియన్ కు చేరుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మూడో టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికా పేసర్ విలియమ్స్ కు గిల్ సరైన బదులిస్తాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, రెండో టీ20లో టీమిండియాపై దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. రింకూ సింగ్ (68*), సూర్యకుమార్ యాదవ్ (56) అర్ధశతకాలు సాధించారు. తిలక్ వర్మ (29) ఫర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం వర్షం కారణంగా టార్గెట్ ను సౌతాఫ్రికాకు 15 ఓవర్లలో 152గా నిర్ణయించారు.

దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. హెండ్రిక్స్ (49), మార్క్రమ్ (30) రాణించారు. టీమిండియా బౌలర్లలో ముఖేశ్ రెండు వికెట్లు, కుల్ దీప్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. కాగా, సిరీస్ లో ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం జరగనుంది.

Story first published: Wednesday, December 13, 2023, 15:24 [IST]
Other articles published on Dec 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+