ఫామ్ ఉన్నంతసేపే బాలీవుడ్ సారా మత్తు
ప్రస్తుతం శుభ్‌మాన్ గిల్ సారా అలీఖాన్ ముంబై రెస్టారెంట్‌లో కన్పించేసరికి.. వీరి మధ్య డేటింగ్ కన్ఫామ్ అయిందంటూ కొందరు అంటున్నారు. ఆ సారాను వదిలి ఈసారి ఈ సారాతో గిల్ సరాసరి డేటింగ్‌కు దిగాడు అంటూ పోస్టులు కుమ్మరిస్తున్నారు. అయితే గిల్, సారా అలీఖాన్ డేటింగ్ కన్ఫామ్‌కు సంబంధించిన ఏ అధికారిక సమాచారం మాత్రం లేదు. ఇకపోతే శుభ్ మాన్ గిల్ వయసు 22 కాగా.. సారా అలీఖాన్ 27కావడం గమనార్హం. దీంతో పిల్లాడిని సారా అలీఖాన్ భలే బుట్టలో వేసుకుందంటూ మరికొందరు కవ్వించే పోస్టులు పెడుతున్నారు. ఫామ్ ఉన్నంత సేపే ఈ బాలీవుడ్ సారా మత్తు ఉంటుందని.. గిల్ జాగ్రత్త అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు.
ముందే హింట్ ఇచ్చిన శుభ్‌మాన్ గిల్
ఇటీవల సారా టెండూల్కర్, గిల్ ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకున్నాక.. గిల్ ఇన్‌స్టాలో ఓ హింటిచ్చాడు. నేను నా భవిష్యత్తు మాత్రమే చూసుకుంటా.. నా గతాన్ని కాదు అంటూ ఓ ట్వీట్ చేసి.. డాట్స్ చాలా పెట్టాడు. దీంతో బ్రేకప్ కన్ఫామ్ అయిందంటూ నెటిజన్లు కన్ఫామ్ చేసేసుకున్నారు. అయితే మరో వైపు సారా టెండూల్కర్ మాత్రం అలాంటి పోస్టులు ఏవీ పెట్టలేదు. దీంతో గిల్ వైపు నుంచే బ్రేకప్ జరిగి ఉండొచ్చని కొందరు అంటున్నారు. ఇక తాజాగా గిల్ సారా అలీఖాన్‌తో విందుకు వెళ్లడం ఈ విషయానికి మరింత బలం చేకూర్చుతుంది.
మంచి ఫామ్‌లో ఉన్న గిల్
ఇకపోతే ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ తరఫున శుభ్‌మాన్ గిల్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. అతను కీలక పరుగులు చేసి జట్టుకు తొలి టైటిల్ అందించడంతో ముఖ్య పాత్ర పోషించాడు. గిల్ అనంతరం వెస్టిండీస్ పర్యటనలో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకుననాడు. ఇక తన సెంచరీ లోటును జింబాబ్వే టూర్‌లో అతను తీర్చుకున్నాడు. గిల్ ఆఖరి వన్డేలో 130పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను జింబాబ్వే పర్యటనలో కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఇకపోతే ఇటీవలే అతను ఇంగ్లీష్ కౌంటీ జట్టు అయిన గ్లామోర్గాన్ తరఫున ఆడడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు.

మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన సారా
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ముద్దుల కుమార్తె అయినా సారా టెండూల్కర్ ఇంగ్లండ్‌లో మెడిసిన్ పూర్తి చేసింది. కొన్నాళ్ల క్రితం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి రాణిస్తోంది. అంతేకాకుండా సారా ఇటీవల బాలీవుడ్ మోడల్, నటులైన బనితా సంధు, తానియా ష్రాఫ్‌లతో కలిసి ఓ టీవీ ప్రకటనలో కూడా నటించింది. ఇక ఆమె బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి కూడా సిద్ధమైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న సారాకు భారీ ఫాలోయింగే ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్టు పెట్టిన క్షణాల్లోనే వైరల్ అవుతుంటుంది. ఇక సారా శుభ్‌మాన్ గిల్ కంటే వయసులో పెద్దది.

సైఫ్ అలీ ఖాన్ కూతురుగా బాలీవుడ్లోకి ఎంట్రీ
ఇకపోతే సారా అలీ ఖాన్‌కు కూడా మంచి బ్రాక్ గ్రౌండ్ ఉంది. ఆమె సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ దంపతుల పెద్ద కుమార్తె. ఇప్పటికే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సారా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇకపోతే ఇంతకుముందు ఆమె కార్తిక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు వారిద్దరు విడిపోయారు. దీంతో సారా సింగిల్ అయిపోవడంతో ఇప్పుడు శుభ్‌మాన్ గిల్‌తో మింగిల్ కావడానికి సిద్ధమైంది. మరీ వీరిద్దరి రిలేషన్ గురించి మరింత స్పష్టత రావాల్సిన అవసరముంది.


Click it and Unblock the Notifications












