న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో తొలిసారి పిలుపు: ఎవరీ శుభమాన్ గిల్, రికార్డులివే!

Shubman Gill: Know the age, records and numbers of Indias latest Test player

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు గురువారం సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) వెల్లడించింది. అందరూ ఊహించినట్లే ఈ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు.

అతడి స్థానంలో సెలక్టర్లు యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌కు చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై అన్ని అన్ని ఫార్మాట్లలో రాణించిన యువ ఆటగాడు గిల్‌కు టెస్టుల్లో తొలిసారి పిలుపు వచ్చింది. దీంతో సొంతగడ్డపై సఫారీలతో జరగనున్న టెస్టు సిరిస్‌లో శుభమాన్ గిల్ అరంగేట్రం చేయనున్నాడు.

ధోని రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ధోని రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్

ఈ నేపథ్యంలో శుభమాన్ గిల్ వయసు, రికార్డులు తదితర వివారలు మీకోసం....

పుట్టినతేదీ

పుట్టినతేదీ

పుట్టింది: సెప్టెంబర్ 8, 1999, ఫజిల్కా, పంజాబ్

బ్యాటింగ్ స్టైల్: కుడిచేతివాటం

ఫస్ట్ క్లాస్ రికార్డు:

మ్యాచ్ లు: 14

పరుగులు: 1443

యావరేజి: 72.15

అత్యధిక స్కోరు: 268

లిస్ట్ ఏ రికార్డు

లిస్ట్ ఏ రికార్డు

మ్యాచ్ లు: 51

పరుగులు: 2031

యావరేజి: 46.15

అత్యధిక స్కోరు: 123 నాటౌట్

ఐపీఎల్

ఐపీఎల్

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది నిర్వహించిన ఐపీఎల్ వేలంలో శుభమాన్ గిల్‌ను కోల్‌కతా యాజమాన్యం రూ. 1.8 కోట్లకు కోనుగోలు చేసింది.

ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్

ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్

2018లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌లో టైటిల్ విజేతగా నిలిచిన జట్టుకు శుభమాన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. ఈ టోర్నీలో నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు బరిలోకి దిగిన శుభమాన్ గిల్ 104.50 యావరేజితో మొత్తం 418 పరుగులు చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాదిరే 2013-14, 2014-15లలో రెండు సార్లు బీసీసీఐ బెస్ట్ జూనియర్ క్రికెట్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.

వెస్టిండీస్-ఎ జట్టుతో

వెస్టిండీస్-ఎ జట్టుతో

గత నెలలో టౌరోబా వేదికగా జరిగిన వెస్టిండీస్-ఎ జట్టుతో జరిగిన మూడో అనధికారిక టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించాడు. 250 బంతుల్లో అజేయంగా 204 పరుగులు చేసి భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ రికార్డును బద్దలు కొట్టాడు. 2002లో జింబాబ్వేతో జరిగిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో గౌతమ్ గంభీర్ 218 పరుగులు చేసినప్పుడు అతడి వయసు 20 ఏళ్లు.

అద్భుతమైన ఫామ్‌లో

అద్భుతమైన ఫామ్‌లో

ప్రస్తుతం ఇండియా-ఏ తరుపున శుభమాన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గిల్ 90, 204, 62, 77, 69, 40 చెలరేగాడు. దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై అన్ని అన్ని ఫార్మాట్లలో రాణించడంతో శుభమాన్ గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

Story first published: Thursday, September 12, 2019, 19:31 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X