న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభ్‌మన్‌ గిల్‌ను ఎప్పుడు కెప్టెన్‌ చేస్తారు.. నెటిజన్‌కు షారుఖ్‌ ఫన్నీ రిప్లై!!

Shubman Gill KKR Captain? KKR praises Shahrukh Khan’s ‘savage’ comment on twitter

ముంబై: బాలీవుడ్‌ కింగ్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) యజమాని షారుఖ్‌ ఖాన్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన సినిమాలు, క్రికెట్ జట్టుకు సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటాడు. క్రికెట్, యాడ్, షూటింగ్‌లలో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ రోజు విశ్రాంతి సమయంలో #AskSrk హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులతో ముచ్చటించాడు.

<strong>టీమిండియా మాజీ కెప్టెన్‌పై చీటింగ్‌ కేసు.. ఔరంగాబాద్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు!!</strong>టీమిండియా మాజీ కెప్టెన్‌పై చీటింగ్‌ కేసు.. ఔరంగాబాద్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు!!

షారుఖ్‌ అదిరిపోయే జవాబు

షారుఖ్‌ అదిరిపోయే జవాబు

#AskSrk అనే ట్విటర్‌ చాట్ షోలో షారుఖ్‌ ఖాన్‌కు ఓ నెటిజన్‌ ప్రశ్నను సందించగా.. అదిరిపోయేలా సమాధానం ఇచ్చాడు. టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను కేకేఆర్‌ ఎప్పుడు కెప్టెన్‌ చేస్తుందని షారుఖ్‌ను ఓ ట్విట్టర్ యూజర్ (నెటిజన్‌) అడిగాడు. దీనికి స్పందించిన షారుఖ్‌.. 'కేకేఆర్‌ నిన్ను హెడ్‌ కోచ్‌ చేసిన వెంటనే' అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సదరు ట్విట్టర్ యూజర్ మరో ప్రశ్న వేయలేదు.

కోచ్‌గా మెక్‌కలమ్‌

కోచ్‌గా మెక్‌కలమ్‌

షారుఖ్‌ ఖాన్‌ ట్వీట్‌ చూసిన కేకేఆర్‌ జట్టు తన అధికారిక ట్విటర్‌లో ఆ జట్టు హెడ్‌ కోచ్‌, న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ను ట్యాగ్‌ చేస్తూ #savagereplies అని ట్వీట్ చేసింది. అంతేకాదు నవ్వుతున్న ఎమోజీని జతచేసి మరో ట్వీట్‌ చేసింది. కేకేఆర్‌ జట్టు కోచ్‌గా మెక్‌కలమ్‌ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. కేకేఆర్‌, షారుఖ్‌ అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తన్నారు.

న్యూజిలాండ్‌ పర్యటనలో గిల్‌

న్యూజిలాండ్‌ పర్యటనలో గిల్‌

ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌ ఇండియా ఏ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు గిల్‌ న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్నాడు. ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. గిల్‌ ఐపీఎల్ లీగ్‌లో కేకేఆర్‌ తరపున ఆడుతున్నాడు. త్వరలో మార్చి చివరలో ప్రారంభం కానున్న సీజన్‌-13లో దినేశ్‌ కార్తిక్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని కోల్‌కతా యాజమాన్యం భావిస్తోంది. ఇదే విషయాన్ని కోచ్ మెక్‌కలమ్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు.

కార్తికే మా కెప్టెన్‌

'2020 సీజన్‌లో దినేశ్ కార్తిక్‌ మా కెప్టెన్‌. అనుభవం ఉన్న అతన్నే కొనసాగించాలనుకుంటున్నాం. జట్టులో ఇయాన్‌ మోర్గాన్‌ కూడా ఉన్నాడు' అని డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో మెక్‌కలమ్‌ అన్నాడు. 2019 డిసెంబర్ నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఆసీస్ పేస్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ను కేకేఆర్‌ రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లకు కొనుకున్న విషయం తెలిసిందే.

Story first published: Thursday, January 23, 2020, 13:08 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X