Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలాంటి పరిస్థితుల్లో గిల్ ఉన్నాడు.. అర్థం చేసుకోండి - KL రాహుల్

పేలవమైన ఫామ్ కొనసాగిస్తున్న యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు కేఎల్ రాహుల్ మద్దతుగా నిలిచాడు. గత కొంతకాలంగా గిల్ టెస్టుల్లో నిరాశపరస్తున్న విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులోనూ 23 పరుగులకే ఔటయ్యాడు. టామ్ హర్టీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి డకెట్ చేతికి చిక్కాడు.

అంతకుముందే గిల్‌కు లైఫ్ లభించింది. 16 పరుగుల వద్ద జో రూట్ బౌలింగ్‌లో క్రీజు బయటికి వచ్చి భారీషాట్‌కు యత్నించాడు. కానీ అది బ్యాట్‌కు సరిగా కనెక్ట్ కాలేదు. అయితే సూర్యుడి ఎఫెక్ట్‌తో బెన్ స్టోక్స్‌కు గాల్లో బంతి కనిపించలేదు. దీంతో స్టోక్స్ క్యాచ్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత కూడా గిల్ జాగ్రత్తగా ఆడలేకపోయాడు. 66 బంతులు ఎదుర్కొన్న గిల్ రెండు బౌండరీలు మాత్రమే సాధించగలిగాడు. దీంతో అతడిపై విమర్శలు మొదలయ్యాయి.

Shubman Gill is in such situations, try to understand - KL Rahul

మరోవైపు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా గిల్ ఔటైన తీరుపై మండిపడ్డాడు. ఒక్క చెత్త షాట్‌తో అప్పటి వరకు గిల్ పడ్డ కష్టాన్ని వృథా చేసుకున్నాడని అన్నాడు. అసలు ఏ షాట్ ఆడుదామని అలా ఆడాడో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ గిల్ బ్యాటింగ్‌కు వచ్చిన పరిస్థితులు అర్థంచేసుకోవాలని కేఎల్ రాహుల్ అన్నాడు. తొలి రోజు ఆట చివర్లో గిల్ బ్యాటింగ్‌కు వచ్చాడని, ఆ సమయంలో వికెట్ కాపాడుకోవాడనికి ప్రయత్నించాడని చెప్పాడు.

మరుసటి రోజు ఆట ప్రారంభంలో కూడా కుదురుకోవడానికి బ్యాటర్లు తొలుత ప్రయత్నిస్తారని రాహుల్ వివరించాడు. ''ఆట ముగిసేవరకు వికెట్ కోల్పోకూడదనే స్థితిలో గిల్ క్రీజులోకి వచ్చాడు. అలాంటి మైండ్ సెట్‌తో వచ్చినప్పుడు ఆ తర్వాత ఫ్రీగా ఆడటం అంత సులువు కాదు.

డిఫెండ్ సంకెళ్లను తెంచుకోవడానికి గిల్ షాట్‌కు యత్నించాడు. కానీ మంచి ఫలితం రాలేదు. ఇది ప్రతి బ్యాటర్‌కు జరుగుతూనే ఉంటుంది. తర్వాత ఇన్నింగ్స్‌లో ఎలా ఆడాలనే విషయంపై ఇప్పుడే ఒక స్పష్టతకు అతడు వచ్చాడని భావిస్తున్నాను. గిల్ టాప్ క్లాస్ క్రికెటర్. అతడు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. వైట్ బాల్ క్రికెట్‌లో అతడి సత్తాఏంటో చూశాం'' అని కేఎల్ రాహుల్ అన్నాడు.

Story first published: Saturday, January 27, 2024, 12:34 [IST]
Other articles published on Jan 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+