Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తమిళంలో థాంక్స్ చెప్పి.. గుండెల్లో గుచ్చిన గుజరాత్ కెప్టెన్!

ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న వేళ టోర్నీలో భారీ హైప్ క్రియేట్ చేసిన 66వ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సీఎస్కేతో జరిగిన ఈ చావో రేవో పోరులో గుజరాత్ ఏకంగా 89 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కేను గుజరాత్ టైటాన్స్ బౌలర్లు, బ్యాటర్లు కలిపి ముప్పుతిప్పలు పెట్టారు. ఈ ఘోర పరాజయంతో సీఎస్కే ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. ఈ సీజన్లో అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మూడో జట్టుగా సీఎస్కే నిలిచింది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

గిల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటో!
మ్యాచ్ ముగిసిన అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్టేడియంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ప్రత్యర్థులను ఆటపట్టించడం అలవాటుగా మార్చుకున్న గిల్.. ఈ సారి ఏకంగా సీఎస్కే అభిమానులను లక్ష్యంగా చేసుని ఓ ఫోటోను షేర్ చేశాడు. తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో తోటి ప్లేయర్లు మహ్మద్ సిరాజ్, జోస్ బట్లర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ సమీపంలో కూర్చున్న ఓ ఫోటోను గిల్ పంచుకున్నాడు. ఈ ఫోటోలో ముగ్గురు ఆటగాళ్లు తమ పెదవులపై వేలు వేసి ప్రత్యర్థులను "సైలెంట్‌"గా ఉండమనే సై చేస్తూ కనిపించడం విశేషం. ఈ పోస్ట్ క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది.

Shubman Gill Instagram Post on CSK Exit Nandri Caption Goes Viral after Knocking Chennai out of IPL

'నంద్రి' క్యాప్షన్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?
ఈ ఫోటో కంటే కూడా గిల్ దానికి పెట్టిన క్యాప్షన్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఆ ఫోటోకు 'Nandri 2. Yellow lights, blue ending' (నంద్రి 2. ఎల్లో లైట్స్, బ్లూ ఎండింగ్) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జతచేశాడు. తమిళంలో 'నంద్రి' అంటే 'ధన్యవాదాలు' అని అర్థం. సీఎస్కే జట్టును టోర్నమెంట్ నుండి పంపించేస్తూ గిల్ ఇలా వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలపడం సీఎస్కే ఫ్యాన్స్‌కు అస్సలు మింగుడు పడటం లేదు. అంతేకాకుండా 'ఎల్లో లైట్స్, బ్లూ ఎండింగ్' అనే ముక్కకు కూడా లోతైన అర్థం ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో సీఎస్కే (పసుపు రంగు - Yellow) భారీ అంచనాలతో, మంచి హవాతో మొదలైనప్పటికీ.. ముగింపు మాత్రం గుజరాత్ టైటాన్స్ (నీలి రంగు - Blue) విజయకేతనంతో ముగిసిందని గిల్ ఇండైరెక్ట్‌గా పంచ్ వేశాడు. ఈ మూడు ముక్కల క్యాప్షన్ నేరుగా సీఎస్కే అభిమానులను రెచ్చగొట్టేలా ఉండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ల యుద్ధం నడుస్తోంది.

పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్.. సీఎస్కే దారుణ ప్రదర్శన
ఈ ఘన విజయంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ తన రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో మొత్తం 18 పాయింట్లు సాధించి గిల్ సేన గర్వంగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. గుజరాత్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. మరోవైపు, ఈ ఏడాది సీఎస్కే ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. టోర్నమెంట్ అంతటా నిలకడలేని ఆటతీరుతో సతమతమైన చెన్నై.. 14 మ్యాచ్‌లలో కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసి, 12 పాయింట్లతో టేబుల్‌లో 7వ స్థానానికి పడిపోయింది. ఫలితంగా ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నమెంట్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించాల్సి వచ్చింది.

Story first published: Friday, May 22, 2026, 9:19 [IST]
Other articles published on May 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+