For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గుజరాత్‌కు బిగ్ షాక్: కెప్టెన్ గిల్‌కు గాయం.. తదుపరి మ్యాచ్ ఆడతాడా?

ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరం కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన కీలక పోరులో శుభ్‌మన్ గిల్ ఆడకపోవడంతో అతని ఫిట్‌నెస్‌పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై జట్టు అసిస్టెంట్ కోచ్ పార్థివ్ పటేల్ స్పందిస్తూ కీలక్ అప్‌డేట్ ఇచ్చారు.

మెడనొప్పితో బాధపడుతున్న గిల్
పార్థివ్ పటేల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుభ్‌మన్ గిల్ మెడనొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం శుభ్‌మన్ గిల్‌కు 'మజిల్ స్పాజమ్' రావడంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని పార్థివ్ పటేల్ పేర్కొన్నారు. అయితే ఈ గాయం అంత తీవ్రమైనది ఏమీ కాదని.. త్వరలోనే గిల్ కోలుకుంటాడని పార్థివ్ భరో ఇచ్చారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరగబోయే తదుపరి మ్యాచ్ సమయానికి శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి మైదానంలోకి దిగుతాడని కోచ్ పార్థివ్ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Shubman Gill Injury Update Will Gujarat Titans Captain Play Next Match Parthiv Patel Gives Big Update

కారణమేంటి?
శుభ్‌మన్ గిల్ గత కొంతకాలంగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతుండటమే ఈ గాయాలకు కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి భారత టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం వల్ల గిల్‌పై పనిభారం విపరీతంగా పెరిగింది. గతంలో దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలోనూ శుభ్‌మన్ గిల్ ఇటువంటి మెడనొప్పితోనే కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నీలో కెప్టెన్ అందుబాటులో లేకపోవడం గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్‌ను బలహీనపరుస్తోంది.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ లేకపోవడంతో సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. సాయి సుదర్శన్ 73 పరుగులతో అద్భుతంగా రాణించినప్పటికీ.. మిడిల్ ఓవర్లలో రవి బిష్ణోయ్ ధాటికి గుజరాత్ టైటాన్స్ తడబడింది. చివర్లో రషీద్ ఖాన్, కగిసో రబాడ పోరాడినప్పటికీ 6 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్, టోర్నీలో నిలబడాలంటే శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్ పునరాగమనం జట్టుకు అత్యవసరం.

Story first published: Sunday, April 5, 2026, 12:57 [IST]
Other articles published on Apr 5, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+