
కన్‌ఫ్యూజ్ చేసిన సీన్ ఇదే..
ఈ ఘటన 18వ ఓవర్లో వెలుగు చూసింది. ఈ ఓవర్లో బంతి అందుకున్న స్పిన్నర్ లియాన్.. నాలుగో స్టంప్ దగ్గర బంతిని విసిరాడు. దీన్ని ముందుకొచ్చి డిఫెండ్ చేసుకోవడానికి గిల్ ప్రయత్నించాడు. అయితే బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో అది అతని బ్యాటును మిస్ అయింది.
లియాన్‌తోపాటు ఆస్ట్రేలియా జట్టు అంతా గట్టిగా అప్పీల్ చేసింది. కానీ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బోరో మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఆస్ట్రలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుకొచ్చాడు. లియాన్‌తో చాలా సేపు చర్చించి చివరకు రివ్యూ తీసుకున్నాడు.

మూడు మీటర్ల రూల్..?
అప్పటికి భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు తొలి బ్రేక్ కోసం చాలా ఆత్రుత కనబరిచారు. ఈ క్రమంలోనే స్మిత్ రివ్యూ తీసుకున్నాడు. ఈ బంతి పిచ్, ఇంపాక్ట్ రెండూ ఆఫ్‌స్టంప్ ఆవలే ఉన్నాయి. అయితే ఈ ఇంపాక్ట్ పాయింట్ టార్గెట్‌కు మూడు మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉంది.
దీంతో 'ఐసీసీ 3 మీటర్ల రూల్' ప్రకారం గిల్ నాటౌట్. కానీ థర్డ్ అంపైర్ అక్కడితో ఆగలేదు. బాల్ ట్రాకింగ్ చెక్ చేశాడు. ఈ ట్రాకింగ్‌లో బంతి నేరుగా వెళ్లి లెగ్ స్టంప్‌ను పడగొడుతున్నట్లు కనిపించింది. కానీ అతను నాటౌట్ అని తేల్చారు.

వికెట్లు మిస్ అయిందా?
ఇది చూసిన స్మిత్, లియాన్ ఇద్దరికీ ఏం అర్థం కాలేదు. వికెట్లు కూలుతున్నా నాటౌట్ ఎలా ఇస్తారని అంపైర్‌ను అడిగారు. ఈ విషయంలో తన నిర్ణయమే కరెక్ట్ అని చెప్పిన కెటిల్‌బోరో బంతి లెగ్ స్టంప్‌ను మిస్ అవుతుందని చెప్పాడు. తనకు అదే అనిపించిందని, అందుకే నాటౌట్ ఇచ్చానని చెప్పాడు. ఇది విన్న స్టీవ్ స్మిత్ ఆశ్చర్యంగా 'వాట్?' (ఏంటి?) అని పెద్దగా అరవడం స్టంప్ మైక్‌లో వినిపించింది.
లియాన్ కూడా అది విని ఆశ్చర్యంగా నవ్వేస్తూ అంపైర్‌తో ఈ విషయం చర్చించాడు. కాసేపటి తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. ఇది జరిగిన తర్వాత కునేమన్ వేసిన ఓవర్లో రోహిత్ నేరుగా లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.


Click it and Unblock the Notifications












