Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR VS GT: శుభ్‌మన్ గిల్ పెళ్లి అప్డేట్ ఇచ్చేశాడు!

Shubman Gill Marriage: శుభ్‌మన్ గిల్ ఆన్ ఫీల్డ్ సీక్రెట్స్, అతడు ఎలా ఆడటాడో క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. అయితే ఈ యంగ్ స్టర్ టీమిండియాలోకి అరంగేట్రం చేసి స్టార్‌గా ఎదిగినప్పటి నుంచి, ఇతడి పర్సనల్ లైఫ్‌పై క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫోకస్ ఎక్కువైపోయింది. అతడు ఎవరితో డేటింగ్ చేస్తున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు వంటి విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. అందుకు తగ్గట్టే అతడి డేటింగ్ లైఫ్ పై కూడా ఎక్కువగా రూమర్స్ రావడం కూడా సహజమైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా గిల్ తన పెళ్లి గురించి కన్ఫామ్ చేశాడు. తాజాగా కేకేఆర్ వర్సెస్ జీటీ (KKR VS GT) మ్యాచ్ టాస్ సమయంలో తన పెళ్లికి సంబంధించిన విషయమై సమాధానమిచ్చాడు.

ఆ నలుగిరితో గిల్ డేటింగ్..
గత కొద్ది కాలం నుంచి టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై డేటింగ్ రూమర్స్ ఎక్కువగానే వస్తున్నాయి. అతడు బాలీవుడ్ భామలతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే పలువురు భామల పేర్లు కూడా వినిపించాయి. మొదట అతడు.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నట్లు మొదలైన ప్రచారం.. ఆ తర్వాత పలువురు ముద్దుగుమ్మల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సారా అలీఖాన్, రిద్ధిమా పండిట్‌, అవనీత్ కౌర్ ఇలా వరుసగా పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అతడు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు ఎక్కువై పోయాయి. క్రికెట్ వర్గాల్లో అంతటా ఇతడి పెళ్లి గురించే చర్చ ఎక్కువైపోయింది.

Shubman Gill gave big update on his marriage in KKR VS GT match ipl 2025

పెళ్లి బాజాలు మోగుతున్నాయా?
ఈ క్రమంలోనే ఇప్పుడు గిల్.. కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచులో తన పెళ్లిపై స్పందించాడు. కామెంటేటర్ మోరిసన్ మాట్లాడుతూ.. 'చూడటానికి బాగున్నావ్. ఉత్సాహంగా ఉన్నావ్. పెళ్లి బాజాలు మోగుతున్నాయా? త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి?' అని అడిగాడు. దీనికి గిల్.. 'అయ్యో అలాంటిదీ ఏమీ లేదు' అంటూ నవ్వుతూ తిరిగి సమాధానమిచ్చాడు. అలా ప్రస్తుతం తన పెళ్లి గురించి వస్తోన్న రూమర్స్ పై ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుట్లో పెళ్లి చేసుకునేది లేదని స్పష్టం చేశాడు.

కాగా, ఈ మ్యాచులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు దిగింది. కేకేఆర్ జట్టులోకి గుర్బాజ్, మొయిన్ అలీ వచ్చారు.

Story first published: Monday, April 21, 2025, 20:13 [IST]
Other articles published on Apr 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+