Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs NZ: ఫైనల్ తర్వాత రోహిత్ వన్డే రిటైర్మెంట్ - గిల్ ఏం చెప్పాడంటే?

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని జోరుగా ప్రచరాం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ముందు జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వైస్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ ఈ విషయం గురించి మాట్లాడాడు. అలానే భారత జట్టు కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

అసలు చర్చకే రాలేదే...
డ్రెస్సింగ్‌ రూమ్ లో రిటైర్మెంట్ల విషయం గురించి అసలు చర్చే జరగలేదని చెప్పాడు శుభ్‌మన్‌ గిల్. రోహిత్‌ శర్మ ప్రపంచంలోనే బెస్ట్ ఓపెనర్‌ అని ప్రశంసించాడు. కోహ్లీ కూడా ఎంతో నైపుణ్యం ఉన్న ప్లేయర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. తాను ఉత్తమ బ్యాటింగ్‌ లైనప్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు.

Shubman Gill gave answer to Rohit Sharma Retired After Champions Trophy final 2025 ind vs nz

"రోహిత్‌శర్మ ప్రపంచంలోనే ఉత్తమమైన ఓపెనర్‌. కోహ్లీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మేము ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. అంతే ఉత్సాహంలో బరిలోకి దిగుతున్నాం. గతంలో మేం వన్డే ప్రపంచ‌ కప్ సాధింంచలేకపోయాం. కానీ ఈ సారి అలా జరగదు. ఫైనల్‌ అంటే కాస్త ఒత్తిడి ఉంటుంది. కానీ మేం దాన్ని మ్యానేజ్‌ చేసుకోగలము.

అసలు ఈ మ్యాచ్ ను ఫైనల్‌గా కాకుండా మరో మ్యాచ్‌లానే భావిస్తున్నాం. టామ్ టీమ్స్ ఎప్పుడూ అలానే ఆలోచిస్తాయి ఇంకా టీమిండియా బ్యాటింగ్‌లో చాలా డెప్త్‌ ఉంది. అందుకే మొదటి మూడు స్థానాల్లో వచ్చే బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది." అని గిల్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, March 9, 2025, 7:25 [IST]
Other articles published on Mar 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+