Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: వాళ్లు వాగుతునే ఉంటారు.. జట్టు కోసం నేను సరైన పనే చేస్తున్నా.. వాళ్ల మాటలను పట్టించుకోను

Shubman Gill Gave a Clarity about His Role and Says He Wont Care the Critics about His strikerate

వైట్‌బాల్ ఫార్మాట్‌లో తన స్లో స్ట్రైక్ రేట్‌పై భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. టీమిండియాకు భవిష్యత్తు స్టార్‌గా అతన్ని పరిగణిస్తున్నప్పటికీ.. గిల్ స్ట్రైక్ రేట్ క్రికెట్ నిపుణులు, అభిమానులు ప్రశ్నలు రేకెత్తిస్తుంటారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గిల్ 102.50 సగటుతో 205పరుగులు చేశాడు. యాదృచ్ఛికంగా అతని స్ట్రైక్ రేట్ కూడా 102.50గా ఉండడం విశేషం. మూడో వన్డేలో వర్షం కారణంగా ఓవర్ల సంఖ్యను తగ్గించడంతో అతను 98* పరుగుల వద్ద సెంచరీ మిస్సయ్యాడు. కాస్త స్పీడ్‌గా ఆడి ఉంటే సెంచరీ సాధించేవాడు.

 ప్రతిస్పందించను

ప్రతిస్పందించను

అయితే తన ఆటపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. గిల్ ది టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ తాను అలాంటి విమర్శలకు, ప్రశ్నలకు పెద్దగా ప్రతిస్పందించబోనని చెప్పాడు. 'నేను ఎలా ఆడినా ఆటపై ప్రశ్నలు లేవనెత్తుతారు. కానీ నా జట్టు విజయానికి నేను సహకరించగలిగేలా ఆడినంత కాలం, నా టీమ్ మేనేజ్‌మెంట్, నా కెప్టెన్ ఆశించినట్లు నేను ప్రదర్శిస్తున్నంత కాలం నాపై విమర్శకులు ఏమి వాగుతున్నా నేను పట్టించుకోను. నా గురించి నా ఆట గురించి నాకు క్లారిటీ ఉంది' అని గిల్ చెప్పాడు.

 సంతృప్తి చెందాను

సంతృప్తి చెందాను

గిల్ వెస్టిండీస్లో తన ప్రదర్శనతో సంతృప్తి చెందానని చెప్పాడు. 'నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, మొదటి రెండు మ్యాచ్‌లలో నేను అవుట్ అయినందుకు కాస్త ఫీలయిన మాట వాస్తవమే. ఏదేమైనప్పటికీ కరేబియన్‌లో విలువైన పరుగులు చేయడం ఓవరాల్‌గా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఓపెనర్‌గా అవకాశాలను పొందడం కూడా సహాయకరంగా అనిపించింది.' అని గిల్ వివరించాడు. గిల్ ప్రస్తుతం జింబాబ్వే పర్యటన కోసం ప్రాక్టీస్లో నిమగ్నం అయ్యాడు. అతను 2023 ప్రపంచకప్ వన్డే జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వన్డే ఫార్మాట్‌లో తన ఫామ్ కొనసాగించాలనుకుంటున్నాడు. గిల్ వెస్టిండీస్ పర్యటనలో మ్యాన్-ఆఫ్-ది-సిరీస్ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే.

బుమ్రా,కోహ్లీ ఫామ్‌లో లేరు ఎలా మరి *Cricket | Telugu OneIndia India Will Win Asia Cup Without Bumrah
 ప్రయోజనకరంగా ఉంది

ప్రయోజనకరంగా ఉంది

'వెస్టిండీస్ పర్యటనలో నా ప్రదర్శన నాకు టీంలో కాస్త ఎడ్జ్ ఇస్తుందని నేను భావిస్తున్నాను. అయితే ఈ ప్రదర్శనను నిలకడగా కొనసాగించడం, నా జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం చాలా ముఖ్యం' అని గిల్ అన్నాడు. గిల్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో తాను చేసిన సంభాషణలను కూడా తెలిపాడు. అండర్-19 రోజులలో తమకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉన్నాడని మరియు సీనియర్ జట్టులో కూడా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ మార్గదర్శకత్వంలో ఆడడం ప్రయోజనకరంగా ఉందని చెప్పాడు. రాహుల్ సార్‌తో నా చర్చలు సరైన నైపుణ్యాలు, టెక్నికల్ మిస్టేక్స్ గురించి ఉంటాయి. నా ఆటలో ఆ విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెంచుతున్నాను. అలాగే ఆటలో మానసిక స్థితి ఇంపార్టెన్స్ గురించి కూడా చర్చిస్తాను' అని గిల్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, August 10, 2022, 21:44 [IST]
Other articles published on Aug 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+