Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఏం నేర్చుకున్నావ్ రా?.. గిల్‌ డకౌట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!

Shubman Gill falls in similar fashion in INDvsAUS second ODI

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లను ఇబ్బంది పెట్టిన ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. ఈ మ్యాచ్‌లో కూడా భారత టాపార్డర్‌ను ఇబ్బంది పెట్టాడు. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లో బంతి అందుకున్న అతను.. మూడో బంతికే గిల్‌ను పెవిలియన్ చేర్చాడు. టీమిండియాలో మంచి ఫామ్‌లో ఉన్న గిల్.. చాలా లూజ్ షాట్ ఆడి అవుటయ్యాడు.

తొలి రెండు బంతులకు డాట్ బాల్స్ ఆడాడు గిల్. తర్వాతి బంతి వైడ్ కాగా.. ఆ మరుసటి బంతికే అనవసరంగా షాట్ ఆడబోయి మైదానం వీడాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవలగా స్టార్క్ వేసిన బంతిని పుష్ చేసేందుకు గిల్ ప్రయత్నించాడు. దీంతో గాల్లోకి లేచిన బంతి పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లబుషేన్ వద్దకు ఛెస్ట్ హైట్‌లో దూసుకెళ్లింది. దాన్ని అతను ఎలాంటి పొరపాటు చెయ్యకుండా చటుక్కున పట్టేశాడు. దీంతో గిల్ నిరాశగా మైదానం వీడాల్సి వచ్చింది. ఇలా తనకు వచ్చిన అవకాశాన్ని గిల్ వృధా చేసుకోవడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కూాడా గిల్ దాదాపు ఇదే మాదిరిగా అవుటయ్యాడు. తనదైన స్టైల్‌లో కట్ షాట్ ఆడే గిల్.. ఇదే షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుటవుతున్నాడు. తొలి వన్డేలో కూడా ఇలాగే ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తుచేస్తున్న ఫ్యాన్స్.. గిల్‌పై మండిపడుతున్నారు. మొదలి మ్యాచ్ నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, శ్రీలంకపై ఆడినట్లు ఆసీస్‌పై ఆడబోతే ఇలాగే ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు. 'మొదటి మ్యాచ్‌లో వేసిన బౌలరే, అదే ఫీల్డర్, అదే బాల్, అదే షాట్, అదే వికెట్' అని విమర్శిస్తున్నారు.

Story first published: Sunday, March 19, 2023, 14:28 [IST]
Other articles published on Mar 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+