Shubman Gill: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నియమితుడైన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా మారిన తర్వాత ఇంగ్లండ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. లీడ్స్ టెస్ట్ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో కూడా శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. శుభ్‌మన్ గిల్ ఈ అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ రికార్డును అధిగమిస్తాడనే అంచనాలు నెలకొన్నాయి.
శుభ్‌మన్ గిల్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్ధలు కొడతాడా?
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇప్పటికే శుభ్‌మన్ గిల్ 500 పరుగులకు పైగా సాధించాడు. ఏదైనా టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ పేరు మీద ఉంది. ఈ రికార్డు 95 సంవత్సరాల నాటిది. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ 1930లో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుపై 974 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో డాన్ బ్రాడ్‌మన్ 7 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు సాధించాడు. శుభ్‌మన్ గిల్ రెండు మ్యాచ్‌లలోనే దాదాపు 600 పరుగులు చేశాడు.

శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ కేవలం 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేశాడు. దీంతో పాటు రెండో ఇన్నింగ్స్ లో కూడా బాగా రాణించి 161 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్ ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌లలో మొత్తం 585 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో ఇదే విధంగా చెలరేగితే డాన్ బ్రాడ్‌మన్ 974 పరుగుల 95 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టగలడు. సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఈ రికార్డును అధిగమించడానికి శుభ్‌మన్ గిల్‌కు 390 పరుగులు అవసరం. డాన్ బ్రాడ్‌మన్ 1930లో ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల్లో 974 పరుగులు చేశాడు.
అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే..
ప్రస్తుత భారత కెప్టెన్ శుభమన్ గిల్ 1971లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సాధించిన 774 పరుగుల భారత రికార్డును బద్దలు కొట్టగలడు. దిగ్గజ సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేశారు. ఆ రికార్డు నేటికీ నిలిచి ఉంది. ఏ భారత ఆటగాడు కూడా ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. రెండో స్థానంలో కూడా గవాస్కరే ఉన్నారు, అతను 1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 732 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ప్రస్తుత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. యశస్వి జైస్వాల్ 2023-24లో ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 712 పరుగులు చేశాడు.రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో 2014-15 సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 692 పరుగులు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్‌తో గిల్ మొత్తం 430 పరుగులు చేశాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు. మొదటి స్థానంలో గ్రాహం గూచ్ ఉన్నారు. ఆయన 1990లో భారత్‌పై 456 పరుగులు చేశాడు.