
ఇంగ్లాండ్‌లోని హోవ్‌లో మంగళవారం జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2 మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ అదరగొట్టాడు. సస్సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లామోర్గాన్ తరఫున శుభ్‌మాన్ గిల్ తన తొలి సెంచరీని సాధించాడు. ఓవర్‌నైట్ స్కోరు 91పరుగులతో బ్యాటింగ్ చేసిన గిల్ 123 బంతుల్లో తన ఎనిమిదో ఫస్ట్-క్లాస్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హోవ్‌లోని కౌంటీ గ్రౌండ్ చుట్టూ తనదైన మార్క్ షాట్లు బాదుతూ అదరగొట్టాడు. తన ఇన్నింగ్స్‌లో అతను 16బౌండరీలు, రెండు సిక్సర్లు కొట్టి అలరించాడు. ఇక తన ఇన్నింగ్స్‌లో 139 బంతుల్లో 119పరుగులు చేశాక.. ఆఫ్ స్పిన్నర్ జాక్ కార్సన్ సీన్ హంట్ చేతిలో గిల్ ఔటయ్యాడు. గిల్ మూడు గంటల 23 నిమిషాల పాటు క్రీజులో పట్టుదలగా నిలబడ్డాడు. గిల్ గ్లామోర్గాన్ కెప్టెన్ డేవిడ్ లాయిడ్ (56)తో కలిసి 57పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇకపోతే గ్లామోర్గన్ ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 533పరుగుల వద్ద 9వికెట్లు కోల్పోయి డిక్లేర్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో క్రిస్ కుకీ (141) సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సస్సెక్స్ 1వికెట్ కోల్పోయి 88పరుగులు చేసింది.
ఇకపోతే శుభ్ మాన్ గిల్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన వన్డేలో తొలి అంతర్జాతీయ సెంచరీ (130పరుగులు) చేసి రాణించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గిల్ దక్కించుకున్నాడు. ఓపెనర్‌గా, వన్డౌన్ బ్యాటర్‌గా గిల్ సత్తా చాటాడు. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్లోను రాణించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన గిల్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.