తప్పంతా బౌలర్లదేనా? మీ బ్యాటర్లు ఏం పీకినట్టు మరి?
ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 99 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. ముంబై బౌలర్ల ధాటికి కేవలం 100 పరుగులకే చాపచుట్టేసింది. అయితే జట్టు మొత్తం బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం ఈ ఓటమికి బౌలర్లనే బాధ్యులను చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మధ్య ఓవర్లలో పట్టు కోల్పోయాం: శుభ్‌మన్ గిల్
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తమ బౌలర్లు మధ్య ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చేశారని అసహనం వ్యక్తం చేశాడు. పిచ్ స్లోగా ఉన్నందున ఇక్కడ 160 నుంచి 170 పరుగులు సరైన స్కోరు అని.. కానీ ముంబైని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని గిల్ పేర్కొన్నాడు. సరైన లెంగ్త్‌లో బంతులు వేయకపోవడం వల్లే ముంబై భారీ స్కోరు సాధించిందని ఆయన అభిప్రాయపడ్డాడు.

తిలక్ వర్మ విధ్వంసం.. రబాడ కష్టం వృథా
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, తిలక్ వర్మ (101*) వీరోచిత సెంచరీతో 199 పరుగులు చేసింది. నిజానికి గుజరాత్ బౌలర్ కగిసో రబాడ పవర్‌ప్లేలోనే 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బతీసినా.. మిడిల్ ఓవర్లలో ఇతర బౌలర్లు తిలక్ వర్మను అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ముంబై బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో గుజరాత్ చేతుల్లోంచి మ్యాచ్ జారిపోయింది.
బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన గుజరాత్ టైటాన్స్
భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు కనీస పోరాట పటిమను కూడా కనబర్చలేదు. ఇన్నింగ్స్ మొదటి బంతికే సాయి సుదర్శన్ ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. ముంబై బౌలర్లు అశ్వని కుమార్ (4/24), మిచెల్ సాంట్నర్,అల్లా ఘజన్‌పర్ చెలరేగడంతో గుజరాత్ పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయింది. చివరకు 100 పరుగులకే ఆలౌట్ అయి ఐపీఎల్ చరిత్రలో తమ జట్టుకు ఉన్న అతిపెద్ద ఓటమి రికార్డును (99 పరుగులు) నమోదు చేసుకుంది.
పాయింట్ల పట్టికలో మార్పులు
ఈ అద్భుత విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించి నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకుంది. మరోవైపు ఈ భారీ ఓటమి వల్ల గుజరాత్ టైటాన్స్ ఆరో స్థానానికి పడిపోయింది. మూడు విజయాలు ఉన్నప్పటికీ.. రన్ రేట్ భారీగా దెబ్బతినడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఓటమి ఓ చిన్న అడ్డంకి మాత్రమేనని, రాబోయే మ్యాచుల్లో బలంగా పుంజుకుంటామని శుభ్‌మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications