Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS ENG 3rd ODI: గిల్ సూపర్ ఫాస్ట్ సెంచరీ.. తొలి భారత బ్యాటర్‌గా మూడు రికార్డులు బ్రేక్

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న మూడో వన్డేలో మరో అరుదైన ఘతన సాధించాడు టీమిండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్. అద్భుత శతకంతో మెరిశాడు. 95 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో సెంచరీ బాదాడు. తద్వారా తమ 50వ వన్డే మ్యాచ్ లో సెంచరీ బాదిన తొలి ప్లేయర్ గా ఘతన సాధించాడు. అలానే 50 ఇన్నింగ్స్ లో అత్యంత వేగంగా ఏడు వన్డే సెంచరీలు బాదిన తొలి క్రికెటర్ గానూ నిలిచాడు.

ఇంకా ఈ మ్యాచ్ లో మరో రికార్డును కూడా అందుకున్నాడు గిల్. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా ఘతన సాధించాడు. అంతకుముందు వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా లెజండరీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు అతడి రికార్డునే శుభమన్ గిల్ బ్రేక్ చేశాడు.

Shubman Gill becomes First Indian player to score a century in 50th ODI in ind vs eng 3rd ODI

మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో అరుదైన రికార్డు..

మూడో వన్డేలో 51 బంతుల్లో అర్ధ శతకాన్ని బాదాడు గిల్. ఈ సిరీస్‌లో అతడికిది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదిన ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గిల్ క‌న్నా ముందు దిలీప్ వెంగ్ స‌ర్కార్‌ శ్రీకాంత్ (1982లో శ్రీలంక పై), (1985లో శ్రీలంక‌పై), మ‌హమ్మద్ అజారుద్దీన్ (1993లో శ్రీలంక పై), ధోనీ (2019లో ఆస్ట్రేలియా పై), శ్రేయాస్ అయ్యర్ (2020లో న్యూజిలాండ్ పై),ఇషాన్ కిషన్ (2023లో వెస్టిండీస్ పై), శుభ్‌మ‌న్ గిల్ (2025లో ఇంగ్లాండ్ పై) ఈ ఘతనకు అందుకున్నారు.

Story first published: Wednesday, February 12, 2025, 16:00 [IST]
Other articles published on Feb 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+