Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS ENG 3rd ODI: శుభమన్ గిల్ ఆల్ టైమ్ రికార్డ్.. ఎవరికీ సాధ్యం కానిది!

టీమిండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా గిల్ ఘతన సాధించాడు. తన 50వ వన్డే మ్యాచ్ లో ఈ ఫీట్ ను టచ్ చేశాడు. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఆఖరి వన్డేలో ఈ రేర్ ఫీట్ ను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో 25 ప‌రుగుల వ్య‌క్తి గ‌త స్కోరు దగ్గర ఈ మార్క్ ను టచ్ చేశాడు. అంతకుముందు వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా లెజండరీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు అతడి రికార్డునే శుభమన్ గిల్ అధిగమించాడు.

వ‌న్డే క్రికెట్ హిస్టరీలో ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 2500 ప‌రుగులు సాధించిన ప్లేయర్స్ వీరే.
టీమిండియా ప్లేయర్ శుభ్‌మ‌న్ గిల్ - (50 ఇన్నింగ్స్)
సౌతాఫ్రికా ప్లేయర్ హ‌షీమ్ ఆమ్లా - (51 ఇన్నింగ్స్)
పాకిస్థాన్‌ ప్లేయర్ ఇమామ్ ఉల్ హ‌క్ - (52 ఇన్నింగ్స్)
వెస్టిండీస్‌ ప్లేయర్ వివియన్ రిచర్డ్స్ - (56 ఇన్నింగ్స్)
ఇంగ్లాండ్‌ ప్లేయర్ జోనాథ‌న్ ట్రాట్ - (56 ఇన్నింగ్స్)

Shubman Gill Becomes Fastest Batter to achieve fastest 25 thousand runs in ind vs eng 3rd ODI

మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో అరుదైన రికార్డు..

ఈ మ్యాచ్‌లో గిల్ మ‌రో రికార్డును కూడా అందుకున్నాడు. 51 బంతుల్లో అర్ధ శతకాన్ని బాదాడు. తద్వారా ఈ సిరీస్‌లో మూడో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదిన ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గిల్ క‌న్నా ముందు దిలీప్ వెంగ్ స‌ర్కార్‌ శ్రీకాంత్ (1982లో శ్రీలంక పై), (1985లో శ్రీలంక‌పై), మ‌హమ్మద్ అజారుద్దీన్ (1993లో శ్రీలంక పై), ధోనీ (2019లో ఆస్ట్రేలియా పై), శ్రేయాస్ అయ్యర్ (2020లో న్యూజిలాండ్ పై),ఇషాన్ కిషన్ (2023లో వెస్టిండీస్ పై), శుభ్‌మ‌న్ గిల్ (2025లో ఇంగ్లాండ్ పై) ఈ ఘతనకు అందుకున్నారు.

Story first published: Wednesday, February 12, 2025, 15:41 [IST]
Other articles published on Feb 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+