INDvsAUS : గిల్ సెంచరీ.. కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఆకట్టుకున్న భారత బ్యాటింగ్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బ్యాటింగ్ లైనప్ చక్కగా రాణించింది. మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే రోహిత్ శర్మ (35) అవుటయ్యాడు. అయితే ఛటేశ్వర్ పుజారా (42) జతకలవడంతో చెలరేగిన శుభ్‌మన్ గిల్ (128) అద్భుతంగా రాణించాడు. మైదానం నలువైపులా షాట్లు బాదుతూ సెంచరీ సాధించాడు. భారత గడ్డపై ఇదే అతని తొలి టెస్టు శతకం కావడం గమనార్హం.

స్వదేశంలో తొలి టెస్టు సెంచరీ..
స్వదేశంలో తొలి సెంచరీ బాదిన గిల్ చాలా సంతోషంగా కనిపించాడు. ఫ్యాన్స్ కూడా గిల్ క్రికెట్‌ను ఏలడానికి వచ్చాడంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఈ ఏడాదిలో గిల్ చేసిన ఐదో సెంచరీ ఇది. మిగతా భారత బ్యాటర్లు అందరూ కలిసి చేసిన సెంచరీలు కూడా ఐదే కావడం గమనార్హం. ఇది చూస్తేనే గిల్ ఎంత సూపర్ ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. గిల్ ఇలా సెంచరీతో ఆకట్టుకున్న కాసేపటికే.. పుజారా పెవిలియన్ చేరాడు. మర్ఫీ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను.. ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

కోహ్లీ మరో రికార్డు..
పుజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా పూర్తిగా కంట్రోల్‌తో ఆడాడు. ఆచితూచి ఆడుతూ చెత్త బంతులకు బౌండరీలు బాదుతూ ఆకట్టుకున్నాడు. గిల్, కోహ్లీ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే కాసేపటికే లియాన్ బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్‌పై డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్.. ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత జడేజాతో కలిసి ఆడిన కోహ్లీ.. ఏడాది కాలంలో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతని కెరీర్‌లో 29వ టెస్టు హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే భారత గడ్డపై 4 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత యాక్టివ్ ప్లేయర్లలో మరెవరూ ఈ ఘనత సాధించలేదు.

స్మిత్ కెప్టెన్సీ సూపర్..
ఆసీస్ బౌలర్లలో లియాన్, మర్ఫీ, కునేమన్ చక్కగా బౌలింగ్ చేశారు. పిచ్ నుంచి కొద్దిగా టర్న్ లభిస్తుండటంతో దాన్ని బాగా వాడుకున్నారు. ఈ క్రమంలోనే చాలా టైట్‌గా బౌలింగ్ చేస్తూ వచ్చారు. రోహిత్‌ను కునేమన్ అవుట్ చేయగా.. పుజారాను మర్ఫీ, గిల్‌ను లియాన్ పెవిలియన్ చేర్చారు. మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా కొత్త బంతి తీసుకున్న ఆస్ట్రేలియా.. చివర్లో ఒక్క వికెట్ అయినా తీసుకోవాలని భావించింది.
కానీ కోహ్లీ, జడేజా సాలిడ్ డిఫెన్స్‌తో ఆ జట్టుకు ఈ అవకాశం ఇవ్వలేదు. కాగా, ఈ మ్యాచ్‌లో కూడా స్టీవ్ స్మిత్ తన మార్కు కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్నాడు. బౌలర్లకు అనుకూలంగా ఫీల్డింగ్ సెటప్ చేసి, భారత బ్యాటర్లు పరుగులు చేయడానికి చాలా కష్టపడేలా చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications