Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో అమ్మాయితో గిల్.. సారా టెండూల్కర్ ఫైర్! (వీడియో)

Shubman Gill-Sara Tendulkar: టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్‌లకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శుభ్‌మన్ గిల్ ఒక తెలియని అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తుండగా.. సారా టెండూల్కర్ ఆ వైపు చూస్తూ ఉన్నారు.

శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ వీడియో వైరల్
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. అందులో 3 మ్యాచ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సిరీస్‌లో టీమిండియాకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్‌లో జరిగిన మాజీ క్రికెట్ యువరాజ్ సింగ్ ఛారిటీ ఈవెంట్‌కు శుభ్‌మన్ గిల్‌తో పాటు భారత జట్టు సభ్యులు, మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో శుభ్‌మన్ గిల్ ఒక తెలియని అమ్మాయితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సారా టెండూల్కర్ కూడా గిల్ వైపు చూస్తూ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.

Shubman Gill and Sara Tendulkar s Viral Video Sparks Rumors

సోషల్ మీడియాలో వైరల్
చాలా కాలంగా శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వీరిద్దరి నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు తరచుగా వారిద్దరి గురించి అంచనాలు వేస్తూ ఉంటారు. ఇంగ్లాండ్‌లోజరిగిన యువరాజ్ సింగ్ ఛారిటీ ఈవెంట్‌కు సారా టెండూల్కర్ తన తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ఈ ఈవెంట్ నుంచి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దీనికి కారణం వీడియోలో శుభమన్ గిల్, సారా టెండూల్కర్ కనిపించడమే. ఆ వీడియోలో శుభ్‌మన్ గిల్ ఒక అమ్మాయితో మాట్లాడుతుంటారు. సరిగ్గా అదే సమయంలో గిల్ వెనుక కూర్చున్న సారా టెండూల్కర్.. గిల్ వైపు తిరిగినట్లు కనిపిస్తుంది. ఈ దృశ్యం మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నాలుగో టెస్టులో గిల్ అదరగొడతాడా?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జులై 23 నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది. దీని కోసం టీమిండియా ఇప్పటికే సన్నద్ధమవుతోంది. గత మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలవడంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు టీమిండియా నాలుగో టెస్ట్ గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో శుభమన్ గిల్‌పై ప్రత్యేక దృష్టి ఉండనుంది. సిరీస్‌లోని మొదటి, రెండవ మ్యాచ్‌లలో గిల్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. రెండో మ్యాచ్‌లో గిల్ డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఇప్పటివరకు భారత కెప్టెన్ ఈ సిరీస్‌లో 600కు పైగా పరుగులు చేశాడు. కాబట్టి మాంచెస్టర్ టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ నుండి అభిమానులు అద్భుతమైన ప్రదర్శనను ఆశిస్తున్నారు.

Story first published: Friday, July 18, 2025, 12:00 [IST]
Other articles published on Jul 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+