సారా టెండూల్కర్, శుభ్‌మాన్ గిల్ బ్రేకప్..! ఇన్‌స్టాలో గిల్ పోస్ట్, ఒకరినొకరు అన్‌ఫాలో..!

కొన్నేళ్లుగా సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాతో శుభ్‌మాన్ గిల్ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు మీడియాలో కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. శుభ్‌మాన్ మంచి ప్రదర్శన ఇచ్చిన ప్రతీసారీ వీరిద్దరి మధ్య తంతు నడుస్తుందనే పోస్టులు రావడం.. సారా హ్యాపీగా ఫీలవుతుందనే కామెంట్లు.. మీమ్స్ తదితర క్యాప్షన్లు పుంఖాను పుంఖాలుగా నెట్టింట ట్రెండ్ అయ్యేవి. అయితే ఇంతవరకు వీరి మధ్య సంబంధం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. పైగా వీరిద్దరు కలిసి కన్పించిన సంఘటనలు కూడా పెద్దగా లేవు. అయినా కానీ వీరి మధ్య లింకు ఉందనే విషయం మాత్రం బహిరంగ రహస్యమే. వీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతుంటారు. అయితే ఆల్ ఆఫ్ సడెన్‌గా గిల్, సారా ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందంటూ వార్తలు పేట్రేగాయి.
చెప్పకనే చెప్పేసిన గిల్
ప్రస్తుతం వీరేందుకు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఒకవేళ గిల్, సారా విడిపోతే అందుకు గల కారణమేంటై ఉంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. గిల్, సారా డేటింగ్ చేసినప్పటికీ.. వారు ఒకరి గురించి ఒకరు పెద్దగా ఎప్పుడూ పెదవి విప్పలేదు. అయితే ఇన్‌స్టాలో ఇరువురు తమ చిత్రాలను పోస్ట్ చేసినప్పుడల్లా ఒకరినొకరు కామెంట్లు చేసుకునేవారు. కానీ వీరిద్దరు అకస్మాత్తుగా అన్‌ఫాలో కావడంతో వీరి మధ్య రిలేషన్ చెడిందని.. బ్రేకప్ అయిపోయిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అలాగే గిల్ సైతం.. ఇన్‌స్టాలో హింటిచ్చాడు. నేను నా భవిష్యత్తు మాత్రమే చూసుకుంటా.. నా గతాన్ని కాదు అంటూ ఓ ట్వీట్ చేసి.. డాట్స్ చాలా పెట్టాడు. దీంతో బ్రేకప్ కన్ఫామ్ అయిందంటూ నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నాడు.
ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న గిల్
ఇకపోతే ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ తరఫున శుభ్‌మాన్ గిల్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. అతను కీలక పరుగులు చేసి జట్టుకు తొలి టైటిల్ అందించడంతో ముఖ్య పాత్ర పోషించాడు. గిల్ అనంతరం వెస్టిండీస్ పర్యటనలో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకుననాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో గిల్ 98* పరుగుల వద్ద ఉండగా వర్షం పడి అతను సెంచరీకి దూరమయ్యాడు. అయితే తన సెంచరీ లోటును జింబాబ్వే టూర్‌లో అతను తీర్చుకున్నాడు. గిల్ ఆఖరి వన్డేలో 130పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను జింబాబ్వే పర్యటనలో కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఇకపోతే ఇటీవలే అతను ఇంగ్లీష్ కౌంటీ జట్టు అయిన గ్లామోర్గాన్ తరఫున ఆడడానికి అగ్రిమెంట్ చేశాడు.

మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన సారా
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ముద్దుల కుమార్తె అయినా సారా టెండూల్కర్ ఇంగ్లండ్‌లో మెడిసిన్ పూర్తి చేసింది. కొన్నాళ్ల క్రితం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి రాణిస్తోంది. అంతేకాకుండా సారా ఇటీవల బాలీవుడ్ మోడల్, నటులైన బనితా సంధు, తానియా ష్రాఫ్‌లతో కలిసి ఓ టీవీ ప్రకటనలో కూడా నటించింది. ఇక ఆమె బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి కూడా సిద్ధమైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న సారాకు భారీ ఫాలోయింగే ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్టు పెట్టిన క్షణాల్లోనే వైరల్ అవుతుంటుంది. ఇక సారా శుభ్‌మాన్ గిల్ కంటే వయసులో పెద్దది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications