అప్పట్లో సచిన్, ఇప్పుడు శుభ్‌మాన్, వాటే మ్యాచింగ్ ఇన్నింగ్స్.. సేమ్ టూ సేమ్ !

తాను సచిన్ టెండూల్కర్‌ను ఆరాధించే పెరిగానంటూ శుభ్‌మన్ గిల్ ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్‌తో మంగళవారం జరిగిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌‌లో గిల్ 49బంతుల్లో అజేయంగా 63పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నోపై గుజరాత్ టైటాన్స్ 62పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ పరంగా ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏప్రిల్ 18, 2009న ఐపీఎల్ సచిన్ టెండూల్కర్ లాంటి ఇన్నింగ్స్‌ను గిల్ ఆడాడు. ఇక 20ఓవర్ల పాటు సిక్సర్ కొట్టకుండా బ్యాటింగ్ చేసిన తొలి ఆటగాడు సచిన్ కాగా.. అదే ఫీట్‌ను తాజాగా శుభ్‌మాన్ గిల్ నిన్నటి మ్యాచ్‌లో అందుకుని రెండో ప్లేయర్‌గా నిలిచాడు.

2009లో సచిన్ ఇన్నింగ్స్ ఇలా..

2009లో సచిన్ ఇన్నింగ్స్ ఇలా..

ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో ఆడిన సచిన్ టెండూల్కర్.. 2009 ఐపీఎల్ తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగగా సనత్ జయసూర్యతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 49బంతుల్లో 59పరుగులతో 20ఓవర్లు ఆడిన సచిన్ నాటౌట్‌గా నిలిచాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 7ఫోర్లు కొట్టాడు. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. అతని స్ట్రైక్ రేటు 120.40గా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై 7వికెట్లు కోల్పోయి 165పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఛేదనలో 7వికెట్లు కోల్పోయి 146పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా 19 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. సచిన్ టెండూల్కర్ ఈ ఇన్నింగ్స్ ఆడినప్పుడు శుభ్‌మాన్ గిల్‌కు 10ఏళ్ల వయస్సు కూడా ఉండకపోవచ్చు. ప్రస్తుతం అతనికి 22ఏళ్లు, ఐపీఎల్లో విజయవంతమైన బ్యాటర్లలో ఒకడిగా గిల్‌కు పేరుంది.

అప్పుడు, ఇప్పుడు సేమ్ సేమ్

అప్పుడు, ఇప్పుడు సేమ్ సేమ్

ఇక నిన్న లక్నో మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ వృద్ధిమాన్ సాహాతో కలిసి ఓపెనింగ్ చేసి అజేయంగా 63పరుగులు చేశాడు. గతంలో సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్ లాగే అతను కూడా 49బంతులే ఎదుర్కొన్నాడు. సచిన్ లాగే 7ఫోర్లు కొట్టాడు. సచిన్ లాగే ఒక్క సిక్సర్ కూడా బాదలేదు. అపట్లో హాఫ్ సెంచరీతో సచిన్ నాటౌట్‌గా నిలవగా.. ఇప్పుడు శుభ్‌మాన్ హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఏకైక హాఫ్ సెంచరీ సచిన్‌దే కాగా లక్నోతో మ్యాచ్‌లో కూడా శుభ్ మాన్‌దే ఏకైక హాఫ్ సెంచరీ. మరో ఆశ్చర్యకర విషయమేంటంటే అప్పట్లో సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందగా.. ఇప్పుడు శుభ్‌మాన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.

అద్భుత ఫామ్‌లో ఉన్న గిల్

అద్భుత ఫామ్‌లో ఉన్న గిల్

ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడిన 12 మ్యాచ్‌లలో 4 హాఫ్ సెంచరీలు సహా 384పరుగులు చేసి ఈ సీజన్లో నాల్గవ అత్యధిక పరుగుల స్కోరర్‌గా ఉన్నాడు. 2009లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఆడిన ఇన్నింగ్స్.. ప్రస్తుతం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో తను ఆడిన ఇన్నింగ్స్ దాదాపు సేమ్ ఉన్నట్లు గిల్ గుర్తిస్తే తప్పకుండా ఎగిరి గంతేస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సచిన్ అంటే అమితంగా గిల్ ఆరాధించేవాడు. ఇక గిల్ ఎప్పుడూ చెప్పేదేంటంటే తన జట్టు ఆడుతున్నప్పుడు విజయంతో ముగించే నాక్ తాను ఆడాలనుకుంటానని చెబుతుంటాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, May 11, 2022, 10:38 [IST]
Other articles published on May 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X