Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లంచ్ కోసమే అతనితో: బ్రావోతో నటి శ్రియా డేటింగ్ వార్తపై వివరణ

ముంబై: వెస్టిండిస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోతో నటి శ్రియా శరణ్ డేటింగ్ చేస్తోందంటూ బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. ఇటీవలే ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి డ్వేన్ బ్రావోతో కలిసి శ్రియా బయటకు వస్తున్న ఫోటో ఒకటి మీడియా కంటపడిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దీంతో ఈ ఫోటోలు పత్రికల్లో రావడంతో పాటు వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన శ్రియా తాను ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదని, మామూలుగా లంచ్ కోసమే అతనితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లానని చెప్పింది.

Shriya Saran on link-up rumours with Dwayne Bravo: I am not dating anyone

నటి శ్రియా, వెస్టిండిస్ క్రికెటర్ బ్రావోతో డేటింగ్‌లో ఉందా?

తాను ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని, జీవితం చాలా సంతోషంగా ఉందని శ్రియా తెలిపింది. బ్రావోతో డేటింగ్ అనే వార్త కేవలం రూమర్ అని తేలిగ్గా కొట్టిపారేసింది. ఇటీవలే బాలీవుడ్ సినిమా దృశ్యంలో నటించిన శ్రియా ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది.

కాగా, 15 సంవత్సరాల క్రితం సినిమా కెరీర్‌ను ప్రారంభించిన పలు కీలక పాత్రల్లో శ్రియా ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ ప్రారంభించినప్పుడు ఎలా ఉందో, అదే గ్లామర్‌ను ఇప్పుడూ అదే గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తన సినిమా కెరీర్‌లో ఎవరితోనూ ఎఫైర్‌లు, బ్రేకప్‌లు లేకుండానే గడిపేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+