Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Shreyas Iyer: టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మార్చి 2025కి ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్‌' అవార్డును గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. న్యూజిలాండ్ కు చెందిన జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రలను అధిగమించి శ్రేయస్ అయ్యర్ ఈ ఘనతను సాధించాడు. గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ నిలకడగా బ్యాట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ లో కూడా అద్భుతాలు చేస్తున్నాడు.

తన ప్రతిభను చూపించిన శ్రేయస్ అయ్యర్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరపున శ్రేయస్ అయ్యర్ 243 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దుబాయ్, పాకిస్థాన్ లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజయం సాధించడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ కంటే ముందు శుభ్‌మన్ గిల్ ఫిబ్రవరిలో ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోపీలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ భారత్ తరపున అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

Shreyas Iyer Wins ICC Player of the Month Award for March 2025

శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే..?
మార్చి నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ అవార్డుకు, తన విజయానికి దోహదపడినందుకు తన సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, "మార్చి నెలలో ఐసీసీ ప్లేయక్ ఆఫ్ ది మంత్ గా ఎంపిక కావడం నాకు నిజంగా గౌరవంగా ఉంది. ఈ గుర్తింపు చాలా ప్రత్యేకమైనది, ముఖ్యంగా మనం ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న నెలలో - ఈ క్షణం నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను." అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.

ఇంత పెద్ద వేదికపై భారత్ విజయానికి తోడ్పడటం ప్రతి క్రికెటర్ కల అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. మార్చిలో జరిగిన మూడు మ్యాచ్ ల్లో శ్రేయస్ అయ్యర్ 57.33 సగటుతో, 77.47 మోస్తరు స్ట్రైక్ రేట్ తో 172 పరుగులు చేశాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రచిన్ రవీంద్ర కంటే కేవలం 20 పరుగులు వెనుకబడి ఉన్నాడు.

Story first published: Tuesday, April 15, 2025, 12:59 [IST]
Other articles published on Apr 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+