శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు!
టీమిండియా టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా జరిగిన ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ పరాజయంతో శ్రేయస్ అయ్యర్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి 4 మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని తొలి భారతీయ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. గతంలో ఏ ఇండియన్ కెప్టెన్ అయినా 4 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లలో సారథ్యం వహించి మొదటి 4 మ్యాచ్‌లలో ఒక్క విజయమైనా సాధించారు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆ ఘనత సాధించలేకపోయాడు.
2026 టీ20 వరల్డ్ కప్ విజేత సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన శ్రేయస్ అయ్యర్‌పై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. గాయాలతో సతమతమవుతున్న ఐర్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్‌లో భారత్ 0-2తో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ ఓటమి తప్పలేదు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ ఆడిన 4 మ్యాచ్‌లలో 3 పరాజయాలు, ఒకటి రద్దు కావడంతో గెలుపు శాతం సున్నాగా ఉంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ వంటి వారంతా తమ కెప్టెన్సీ కెరీర్ ప్రారంభంలో విజయాలు నమోదు చేసినవారే కావడం గమనార్హం.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(43), ఇషాన్ కిషన్(49) జట్టుకు మంచి స్కోరును అందించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 37 పరుగులు చేశాడు. చివరలో తిలక్ వర్మ కేవలం 11 బంతుల్లోనే 24 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో తిలక వర్మ ఏకంగా 17 పరుగులు రాబట్టడంతో భారత్ గౌరవప్రదమైన సోకురు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ టీమిండియా పరుగుల వేగాన్ని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే అర్ష్‌దీప్ సింగ్ షాకిచ్చాడు. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్‌లను త్వరగానే పెవిలియన్ కు పంపినప్పటికీ.. హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేసి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు తిప్పాడు. హ్యారీ బ్రూక్ ఔట్ అయిన అనంతరం జాకబ్ బెథెల్ బాధ్యతాయుతంగా ఆడి 46 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. టామ్ బాంటన్‌తో కలిసి బెథెల్ 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముఖ్యంగా మ్యాచ్ 17వ టర్నింగ్ పాయింట్‌గా మారింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆ ఓవర్లో రెండు నో బాల్స్‌తో సహా ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌తో టీమిండియా ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. జాకబ్ బెథెల్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ చెత్త రికార్డు, వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తాము ప్రస్తుతం అత్యంత కింది స్థాయిలో ఉన్నామని.. ఇక్కడి నుంచి మరింత దిగజారే అవకాశం లేదని .. కాబట్టి ఇకపై తాము ముందుకు సాగుతూ మ్యాచ్‌లు గెలవడం మాత్రమే మిగిలి ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తదుపరి మ్యాచ్ లో బలంగా రీఎంట్రీ చేస్తామని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మూడో టీ20 మ్యాచ్ జులై 7న(మంగళవారం) జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తన మొదటి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications