INDvsAUS : రెండో టెస్టులో జట్టుతో చేరుతున్న అయ్యర్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!

టీమిండియా యువప్లేయర్ మళ్లీ జట్టుతో కలుస్తున్నాడు. దీంతో భారత జట్టు మరింత బలంగా తయారవుతుందని అభిమానులు సంతోషిస్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ ముందు వెన్నునొప్పితో జట్టుకు అతను దూరమవడంతో టీమిండియా చాలా కష్టపడాల్సి వచ్చింది. అతనెవరో కాదు ముంబై బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్. గతేడాది టెస్టులు, వన్డేల్లో టీమిండియా మిడిలార్డర్‌లో ఎంతో కీలకంగా మారిన అతను.. ఆస్ట్రేలియా సిరీసులో కూడా జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా ఎదిగాడు.

మిడిలార్డర్‌లో కీలకం..
అయితే సరిగ్గా మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతనికి వెన్నునొప్పి వచ్చింది. దీంతో తొలి టెస్టులో అతను ఆడలేదు. నాగ్‌పూర్ టెస్టులో అతను లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకోలేదు. కోహ్లీ, పుజారా కూడా విఫలం అవడంతో మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. అప్పుడు క్రికెట్ అభిమానులు అందరికీ అయ్యర్ ఉంటే బాగుండు అనిపించింది. అలాంటి వారికి బీసీసీఐ శుభవార్త చెప్పింది. అయ్యర్ కోలుకున్నాడని, అతను ఆడేందుకు రెడీగా ఉన్నాడని నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది.

ఢిల్లీలో ఆడతాడా?
'భారత ఆటగాడు శ్రేయాస్ అయ్యర్.. నేషనల్ క్రికెట్ అకాడమీలో తన రీహాబ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్నాడు. వెన్నునొప్పి నుంచి కోలుకున్న అతనికి బీసీసీఐ మెడికల్ టీం కూడా క్లియరెన్స్ ఇచ్చింది' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. న్యూజిల్యాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న సమయంలోనే అతనికి వెన్నునొప్పి వచ్చింది. దీంతో జట్టుకు దూరమవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అతను కోలుకోవడంతో రెండో టెస్టు సమయానికి అతను టీమిండియాతో కలుస్తాడని సమాచారం. కానీ ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్‌లో అతన్ని ఆడిస్తారా? లేదా? అనేది అనుమానంగానే ఉంది.

ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..
సూర్యకుమార్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ఈ క్రమంలో రెండో టెస్టులో కూడా సూర్య విఫలమైతే.. మూడో మ్యాచులో అయ్యర్‌ను ఆడిస్తారని తెలుస్తోంది. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీసులో కూడా అయ్యర్ అద్భుతంగా ఆడాడు. సెంచరీ చేయకపోయినా.. ఆ రెండు టెస్టుల సిరీసులో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో కూడా టీమిండియా మిడిలార్డర్‌లో కీలకంగా మారాడు. అయ్యర్ మళ్లీ జట్టుతో చేరుతున్నాడని తెలిసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అతని రాకతో టీమిండియా మిడిలార్డర్ మళ్లీ బలంగా మారుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications