For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫీషియల్ : పంజాబ్ కింగ్స్ 'కెప్టెన్స్' రికార్డ్ - కొత్త సారథి అతడే

ఐపీఎల్ 2025 మెగా‌‌ వేలంలో రెండో అత్యధిక ధర పలికిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ‌‌‌‌ పంజాబ్ కింగ్స్‌‌ కింగ్స్ అతడిని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడతడు ఆ జట్టుకు కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. గత సీజన్‌‌లో సారథిగా కోల్‌‌కతా నైట్ రైడర్స్‌‌కు ట్రోఫీని అందించిన శ్రేయస్ అయ్యర్‌‌ను ఈ సీజన్ వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ రూ. 26.75 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో ముందుగా ఊహించినట్టుగానే అతడికే సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

కాగా, 2015లో ఐపీఎల్‌‌ అరంగేట్రం చేసిన శ్రేయస్‌ మొదట దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2018 సీజన్‌‌ మధ్యలో ఆ జట్టుకు సారథిగా అయ్యాడు. వరుసగా మూడు సీజన్ల పాటు ఆ జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత కేకేఆర్ జట్టులోకి మారిపోయాడు.

Shreyas Iyer to captain Punjab Kings in IPL 2025

ఎక్కువ మంది కెప్టెన్లు ఉన్న జట్టుగా
ఐపీఎల్ చరిత్రలో ఎక్కవ మంది కెప్టెన్లు మారిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఆ జట్టుకు 17 మంది సారథులు వచ్చారు. వీరిలో యువరాజ్ సింగ్, సంగక్కర, జయవర్దనే, గిల్ క్రిస్ట్, డేవిడ్ హస్సీ, బెయిలీ, సెహ్వాగ్, మిల్లర్, మురళీ విజయ్, మ్యాక్స్ వెల్, రవిచంద్రన్ అశ్విన్, KL రాహుల్, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, సామ్ కరన్, జితేశ్ శర్మ ఉన్నారు. కానీ ఆ టీమ్ ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీని కూడా ముద్దాడలేకపోయింది. ఇప్పుడు తాజాగా శ్రేయస్ కెప్టెన్ అయ్యాడు. చూడాలి మరి అయ్యర్ అయినా పంజాబ్ రాత మారుస్తాడేమో.

గౌరవంగా భావిస్తున్నా
'జట్టు నాపై నమ్మకం ఉంచడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి మరోసారి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అని శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. 2020లో దిల్లీ క్యాపిటల్స్‌కు పాంటింగ్‌ హెడ్‌ కోచ్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శ్రేయస్‌ ఆ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వీరిద్దరి ఆధ్వర్యంలో ఆ సీజన్‌లో దిల్లీ రన్నర్‌పగా నిలిచింది.

వేదికలు ఇవే
2025 ఐపీఎల్‌ మార్చి 21న ప్రారంభం కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్ తో పాటు మే 25న జరగబోయే ఫైనల్‌కు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. సంప్రదాయం ప్రకారమే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సొంత మైదానంలో టోర్నీ తొలి, ఆఖరి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకుంది. కాబట్టి క్వాలిఫయర్‌ 2కు కూడా ఈడెన్‌ ఆతిథ్యం ఇస్తుంది.

ఇక ప్లేఆఫ్స్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌లకు హైదరాబాద్‌ వేదిక ఉండనుంది. ఐపీఎల్‌ పూర్తి షెడ్యూలు ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 2025 ఐపీఎల్‌ సీజన్‌లో 74 మ్యాచ్‌ల ఉంటాయి.

మరోవైపు మహిళల ప్రిమియర్‌ లీగ్‌ కోసం బీసీసీఐ నాలుగు వేదికలను ఖరారు చేసింది. ముంబయి, బెంగళూరు, బరోడా, లఖ్‌నవూలలో డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

Story first published: Monday, January 13, 2025, 9:32 [IST]
Other articles published on Jan 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+