టీమిండియాకు ది బెస్ట్ కేప్టెన్ కాగలడు- జోస్యం చెప్పిన మాజీ లెజెండ్
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం టెస్ట్, వన్డే జట్లను ప్రకటించింది బీసీసీఐ. శుభమాన్ గిల్ రెండు ఫార్మాట్లకూ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. వన్డే జట్టుకు శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్.. టీమిండియా టీ20 ఫార్మట్ కెప్టెన్సీని చేపట్టడానికి శ్రేయాస్ అయ్యర్ కు అన్ని అర్హతలూ ఉన్నాయని ప్రశంసించాడు. ప్రస్తుతం ఈ ఫార్మట్ కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యాన్ని వహిస్తోన్నాడు.
పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడాడు రికీ పాంటింగ్. టీ20 జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి శ్రేయాస్ అయ్యర్ ప్రధాన పోటీదారులలో ఒకడని స్పష్టం చేశాడు. ఈ హోదా కోసం చాలా మంది గొప్ప ఆటగాళ్ళు పోటీలో ఉన్నప్పటికీ, శ్రేయాస్ ఫ్రంట్ రన్నర్ అని పేర్కొన్నాడు. 2023 డిసెంబర్ లో చివరిసారిగా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు శ్రేయాస్. అప్పటి నుండి తిరిగి జట్టులోకి రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

ఐపీఎల్ మొత్తానికీ బెస్ట్ కేప్టెన్ అయ్యరేనని ప్రశంసించాడు పాంటింగ్. "టోర్నమెంట్ ప్రారంభంలోనే అతను ఎంత గొప్ప టీ20 ఆటగాడో చాటుకున్నాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా, గ్రౌండ్ లోపల, బయటా అతని ఆట తీరు, పరిణతి చూశాం.." అని వివరించాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, టీమిండియా టీ20 ఫార్మట్ కు ఓ గొప్ప కేప్టెన్ కాగలడని పేర్కొన్నాడు.
"14 మ్యాచ్‌లు ఉన్న ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నమెంట్‌లో నిలకడగా రాణించడం కష్టం. వ్యక్తిగతంగా, జట్టుగా ఎత్తుపల్లాలు సహజం.. " అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ, శ్రేయాస్ అయ్యర్ సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశాడు. చివరి మ్యాచ్‌లో అతను ఖచ్చితంగా పుంజుకుంటాడని, భారీ స్కోర్ తో జట్టును గెలిపిస్తాడని నమ్ముతున్నట్లు చెప్పాడు.
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌లో కూడా మెరిశాడు. 13 మ్యాచ్‌లలో 44.00 సగటు, 162.70 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో మొత్తం 396 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో అతను అయిదు హాఫ్ సెంచరీలు మోదు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం 36 బంతుల్లో అజేయంగా 71 పరుగులు చేసి తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications