ఆఖరి ఓవర్‌లో 29 పరుగులు: మణికట్టు స్పిన్నర్లపై అయ్యర్ ఇలా!

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా మణికట్టు స్పిన్నర్లు అయిన కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లాలను అయ్యర్ చాలా అలవోకగా ఎదుర్కొన్నాడు. దీనిపై మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ 'కుల్దీప్, చావ్లా బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత కష్టేమేమి కాదు. ఎందుకంటే నేను డొమెస్టిక్ క్రికెట్‌లో చాలా సార్లు వారి బౌలింగ్‌లో రాణించా' అని చెప్పాడు.

నరైన్ బౌలింగ్‌పై మ్యాచ్‌కు ముందు కసరత్తు చేశా
'అయితే, సునీల్ నరైన్ బౌలింగ్‌పై మ్యాచ్‌కు ముందు కసరత్తు చేశా. చాలా మంది ఈ రోజుల్లో ఆఫ్ స్పిన్ వేస్తున్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ముందే సిద్దమయ్యా. నరైన్ వంటి బౌలర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలరు. వరుసగా వికెట్లు సాధిస్తూ ఒత్తిడిలోకి నెట్టెస్తారు. దీంతో అతని బౌలింగ్‌పై ప్రణాళికతో మైదానంలోకి వచ్చా' అని తెలిపాడు.

కుల్దీప్, చావ్లా బౌలింగ్ కోసం ఎదురు చూశా
'కుల్దీప్ యాదవ్, పియూష్ చావ్లా బౌలింగ్ కోసం ఎదురు చూశాను. వారి బౌలింగ్‌లో సులువుగా బౌండరీలు సాధించా. అందుకోసమే తొలుత బ్యాటింగ్‌ను నెమ్మదిగా ఆరంభించా' అని శ్రేయాస్ అయ్యర్ వివరించాడు. ఇక అండర్-19 యువ బౌలర్ శివమ్ మావి వేసిన ఆఖరి ఓవర్‌పై కూడా అయ్యర్ స్పందించాడు.

ఆఖరి ఓవర్‌లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్
ఈ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ సంచలన రీతిలో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ బాది ఏకంగా 29 పరుగులు పిండుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అయ్యర్ 'చివరి ఓవర్ చాలా ముఖ్యమైనది. ఇక బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్‌కు మరింత అవసరం. ఇంతకు ముందెప్పుడు అతని బౌలింగ్ ఆడలేదు. ఈ ఓవర్ చాలా ముఖ్యం అని భావించా' అని అన్నాడు.

అదృష్టవశాత్తు ఆ షాట్‌లు సఫలమయ్యాయి
'నేను కొత్త అని అతను కూడా వినూత్నంగా ప్రయత్నిద్దామని యార్కర్లు వేసాడు. నేను అర్థం చేసుకొని స్ట్రైట్‌గా ఆడాను. అదృష్టవశాత్తు ఆ షాట్‌లు సఫలమయ్యాయి. భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలంటే చివరి ఓవర్ ఎంతో అవసరం అని భావించే హిట్ చేశాను' అని వివరించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 55 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications