Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది సర్పంచ్ సాబ్ అడ్డా.. గింత రచ్చ లేపుతావని అనుకోలే భయ్యా!

IPL 2026: ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న గణాంకాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తన ప్రశాంతమైన ముఖ కవళికలతో, దూకుడు వ్యూహాలతో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. క్రీడారంగంలో శ్రేయస్ అయ్యర్‌ను ఇప్పుడు 'సర్పంచ్ సాబ్' అని పిలుచుకుంటుండగా.. కెప్టెన్సీ రికార్డుల్లో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టేస్తున్నాడు.

శ్రేయస్ అయ్యర్ హవా
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లెక్కలను పరిశీలిస్తే.. అతడి ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు శ్రేయస్ అయ్యర్ మొత్తం 93 ఐపీఎల్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా.. అందులో 55 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. కేవలం 35 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమిని చవిచూశాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ గెలుపు శాతం 59.13 శాతానికి చేరుకుంది. ఐపీఎల్ చరిత్రలో సుదీర్ఘకాలం కెప్టెన్లుగా ఉన్న రోహిత్ శర్మ, ధోనీల రికార్డులకు ఇది గట్టి పోటీనిస్తోంది.

Shreyas Iyer Surpasses MS Dhoni and Rohit Sharma in Win Percentage The New Mastermind of IPL Captaincy

జట్టు ఏదైనా.. గెలుపే లక్ష్యంగా!
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ప్రత్యేకత ఏంటంటే.. ఆయన ఏ జట్టుకు సారథ్యం వహించినా తనదైన ముద్ర వేస్తున్నాడు. మొదటి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును విజయపథంలో నడిపించిన ఆయన.. ఆ తర్వాత కేకేఆర్ జట్టుకు 2024లో టైటిల్‌ను అందించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టును కూడా ఓ బలమైన శక్తిగా తీర్చిదిద్దుతున్నాడు. సీనియర్ ప్లేయర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలో తెలిసిన చతురత కలిగిన నాయకుడిగా శ్రేయస్ అయ్యర్ గుర్తింపు పొందాడు.

ధోనీ, రోహిత్‌లతో పోలిక
ఎంఎస్ ధోనీ సీఎస్కేను ఓ బ్రాండ్‌గా మార్చితే.. రోహిత్ శర్మ ముంబైని 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే ప్రస్తుత గెలుపు శాతం రేసులో శ్రేయస్ అయ్యర్ వీరిద్దరినీ సవాలు చేస్తున్నాడు. ఒత్తిడిలో కూడా పట్టు వదలకుండా, జట్టుకు అండగా నిలబడటం శ్రేయస్ అయ్యర్ స్టైల్. సౌరవ్ గంగూలీలో ఉండే దూకుడు, ఎంఎస్ ధోనీలో ఉండే నిలకడ రెండూ కలిసిన వ్యక్తిత్వమే శ్రేయస్ అయ్యర్ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు. స్టేడియంలో బౌలింగ్ మార్పులు చేయడం లేదా ఫీల్డింగ్ సెట్ చేయడంలో శ్రేయస్ అయ్యర్ తీసుకునే నిర్ణయాలు ఆయనను ఓ తెలివైన వ్యూహకర్తగా నిలబెట్టాయి. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయమనిపిస్తోంది. ఐపీఎల్ ప్రపంచానికి ఓ కొత్త నాయకుడు దొరికాడని 59.13 శాతం విన్నింగ్ రేట్ స్పష్టంగా చెబుతోంది.

Story first published: Tuesday, April 21, 2026, 11:10 [IST]
Other articles published on Apr 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+