For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రేయస్ నన్ను కొట్టాల్సింది: పంజాబ్ స్టార్ ప్లేయర్

IPL 2025: ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ గెలిచిన తర్వాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్‌పై మైదానంలో సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత శశాంక్ సింగ్ ఈ సంఘటనపై స్పందిస్తూ కీలక విషయాన్ని వెల్లడించాడు. శశాంక్ సింగ్ తండ్రి కూడా మ్యాచ్ తర్వాత తన కోపాన్ని వ్యక్తం చేశారు.

శ్రేయస్ అయ్యర్ గురించి కీలక విషయం చెప్పిన శశాంక్ సింగ్
ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో శశాంక్ సింగ్ కష్టకాలంలో తన తప్పు కారణంగా రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మ్యాచ్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన అసహనాన్ని వెళ్లగక్కాడు. మ్యాచ్ అనంతరం శశాంక్ సింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు శ్రేయస్ అయ్యర్ వద్దకు వచ్చినా పట్టించుకోలేదు. తాజాగా ఈ విషయంపై శశాంక్ సింగ్ స్పందించాడు. ఆ కీలక మ్యాచ్‌లో తాను ఘోర తప్పిదం చేశానని శశాంక్ అంగీకరించాడు. ఆసమయంలో శ్రేయస్ తనను చెంపదెబ్బ కొట్టాల్సిందని అభిప్రాయపడ్డాడు.

Shreyas Iyer Should ve Slapped Me Says Punjab Star Player Shashank Singh

ఈ సంఘటనపై శశాంక్ తన స్పందన తెలియజేస్తూ ఓ ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు. " నిర్లక్ష్యంగా పరిగెత్తి నేను తప్పు చేశాను. శ్రేయస్ అయ్యర్ నన్ను చెంపదెబ్బ కొట్టి ఉండాల్సింది. మా నాన్న కూడా నాపై సీరియస్ అయ్యాడు. ఫైనల్ వరకు నాతో మాట్లాడలేదు. నానే చాలా క్యాజువల్ గా పరిగెత్తాను. తోటలో నడిచినట్లు కూడా కాదు.. బీచ్‌లో నడిచినట్లు పరిగెత్తుకుంటూ వెళ్లాను. అది చాలా కీలకమైన సమయమని.. ఇది నీ నుంచి ఊహించలేదని శ్రేయస్ నాతో అన్నాడు. కానీ తర్వాత శ్రేయస్ నన్ను డిన్నర్‌కు తీసుకెళ్లాడు." అని శశాంక్ సింగ్ చెప్పుకొచ్చాడు.

ఫైనల్‌లో పోరాట పటిమను ప్రదర్శించిన శశాంక్ సింగ్
ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ జరిగింది. ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసిది. బదులుగా పంజాబ్ కింగ్స్ జట్టు 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. 6 పరుగుల తేడాతో పంజాబ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో శశాంక్ సింగ్ చివరి ఓవర్ వరకు పోరాడాడు. శశాంక్ 30 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత కూడా శశాంక్ సింగ్ తన జట్టును మొదటి సారి ఐపీఎల్ ఛాంపియన్ చేయలేకపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో శశాంక్ సింగ్ 6 సిక్సర్లు కొట్టాడు.

Story first published: Sunday, June 8, 2025, 15:59 [IST]
Other articles published on Jun 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+