హామిల్టన్‌లో అయ్యర్ అరుదైన ఘనత.. సెహ్వాగ్ తర్వాత ఆ రికార్డు శ్రేయాస్‌దే!!

హామిల్టన్: సెడాన్ పార్క్ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ చెలరేగారు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఆటగాడు పరుగుల వరద పారించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసి.. కివీస్ ముందు 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ (103; 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్)తో విజృంభించి టీమిండియా భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. ఇది అయ్యర్‌కు తొలి వన్డే సెంచరీ.

అరుదైన జాబితాలో స్థానం:
కెరీర్‌లో తొలి వన్డే శతకం సాధించిన శ్రేయాస్ అయ్యర్ అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. హామిల్టన్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా అయ్యర్ నిలిచాడు. 2009లో ఇదే మైదానంలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అజేయంగా 125 పరుగులు చేశాడు. ఇదే ఇక్కడ భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా.. ఆ తర్వాత స్థానంలో అయ్యర్ నిలిచాడు.

ధావన్‌ను అధిగమించిన అయ్యర్:
తొలి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ 103 పరుగులు చేయడంతో.. ఓపెనర్ శిఖర్ ధావన్‌ను అధిగమించాడు. 2015లో ధావన్ 100 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంతకాలానికి ఇక్కడ అయ్యర్ శతకం (103) సాధించాడు.సెహ్వాగ్, అయ్యర్, ధావన్‌ల తర్వాత స్థానంలో లోకేష్ రాహుల్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ అజేయంగా 88 పరుగులు చేశాడు.

మూడో జోడిగా అయ్యర్-రాహుల్:
హామిల్టన్‌లో భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జోడిగా అయ్యర్-రాహుల్‌లు నిలిచారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అంతకుముందు సెహ్వాగ్-గౌతం గంభీర్‌లు 201 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. ఇక ధావన్-రోహిత్ శర్మల జోడి 174 పరుగులు చేసారు. టీమిండియా తరఫున ఇక్కడ అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జోడిగా ఎంఎస్ ధోనీ-రవీంద్ర జడేజాలు ఉంది. 2014లో ఇక్కడ అజేయంగా ఆరో వికెట్‌కు 127 పరుగులు జత చేశారు.

వెస్టిండీస్ తర్వాత భారత్:
హామిల్టన్‌లో భారత్ నమోదు చేసిన 347 పరుగుల స్కోరు ఇక్కడ రెండో అత్యుత్తమ స్కోరుగా నిలిచింది. వన్డే ఫార్మాట్‌లో అంతకుముందు 2014లో వెస్టిండీస్ ఇక్కడ 363 పరుగులు సాధించగా.. ఆ తర్వాత స్థానంలో టీమిండియా నిలిచింది. మూడో స్థానంలో 2007లో ఆసీస్ 346 పరుగులతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications