Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నాలుగులో రానందుకు బాధలేదు.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధం'

Shreyas Iyer says In current situation, you should be ready to bat anywhere

రాజ్‌కోట్‌: తరచూ ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానందుకు బాధలేదు. ప్రస్తుతం జట్టులో నెలకొన్న పోటీతో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలని టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అంటున్నాడు. ప్రతిసారీ ఒకే స్థానంలో రావడం కుదర్లేదని బాధపడొద్దు అని అన్నాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్‌ రాహుల్‌లు జట్టులో ఉండడంతో ముంబై వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో అయ్యర్‌ ఐదవ స్థానంకు వెళ్ళాడు.

ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధం:

ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధం:

తాజాగా శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోని స్థానాలపై స్పందించాడు. 'ప్రస్తుత పరిస్థితిలో ఏ నంబర్‌లోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే జట్టులో ఆడటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న పోటీని పరిగణనలోకి తీసుకుంటే.. కచ్చితంగా ఏదో ఒక స్థానంలో మాత్రమే బ్యాటింగ్‌ చేస్తానని చెప్పేందుకు కారణాలు చెప్పొద్దు. ప్రతిసారీ ఒకే స్థానంలో రావడం కుదరదు. నాలుగులో రానందుకు బాధలేదు. మేం ప్రయోగాలపై దృష్టి సారించాల్సి ఉంది. అందరూ ఏదో ఒక స్థానంలో కుదురుకుంటారని భావిస్తున్నా' అని శ్రేయస్‌ అన్నాడు.

ప్రయోగాలు చేయాలి:

ప్రయోగాలు చేయాలి:

'ఇప్పుడు మేం ప్రయోగాలు చేయాలి. అలాగైతేనే భవిష్యత్తులో అవి పనిచేస్తాయి. కొన్నిసార్లు జట్టు కుప్పకూలుతుంది. అభిమానులు అందుకు సిద్ధంగా ఉండరు. కానీ.. ఆటలో ఇవన్నీ సహజమే. అయితే అడ్డంకులు దాటుకుంటూ ముందుకెళ్లాలి. ఒక జట్టుగా సీజనంతా మేం బాగా ఆడుతున్నాం. ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంది. దీని నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఎక్కడ లోపం ఉందో తెలుసుకుని అధిగమించాలి' అని శ్రేయస్‌ పేర్కొన్నాడు.

బుమ్రా బౌలింగ్‌లో ఎలాంటి మార్పు లేదు:

బుమ్రా బౌలింగ్‌లో ఎలాంటి మార్పు లేదు:

'నెట్స్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సాధన చేస్తున్నా. పునరాగమనం తర్వాత అతడి బౌలింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. మంచి వేగం ఉంది. వెస్టిండీస్‌పై మేం 0-1 నుంచే పుంజుకున్నాం. ఇప్పుడూ కూడా అలా చేయగలం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో దాని గురించే చర్చించుకున్నాం. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇలా ఉంటేనే విజయాలు అందుతాయి. గ్లెన్ మాక్స్‌వెల్‌ జట్టులో ఉన్నా లేకున్నా అతడి వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. అందుకే అతడి వైఖరి నాకెంతో ఇష్టం' అని శ్రేయస్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, January 17, 2020, 13:23 [IST]
Other articles published on Jan 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+