
N0.4 స్పాట్ సమస్య పరిష్కారం అయ్యరే:
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీ చేసాడు. ఇప్పటి వరకు శ్రేయస్ 16 వన్డేల్లో 48 సగటుతో 6 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. మ్యాచ్ అనంతరం అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నాడు. 'భారత్-ఏలో ఎప్పుడూ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేసేవాడిని కాదు. అప్పటి పరిస్థితులను బట్టి 3, 4, 5 స్థానాల్లో ఆడేవాడిని. భిన్నమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడం, వాతావరణానికి అలవాటు పడేందుకు ఇది ఎంతో సాయం చేసింది' అని అన్నాడు.

మ్యాచ్ గెలిస్తే బాగుండేది:
'నా బ్యాటింగ్ మెరుగయ్యేందుకు భారత్-ఏ మ్యాచులు సాయపడ్డాయి. అక్కడ ఎక్కువగా ఒత్తిడేమీ ఉండదు. సీనియర్ స్థాయిలోనూ భిన్నంగా ఏమీ లేదు. చాలాసార్లు అక్కడ ఆడినవారే ఇక్కడుంటారు. నా అట పట్ల సంతోషంగా ఉన్నా. సెంచరీ చేసినందుకు సంతోషమే, కానీ.. మ్యాచ్ గెలిస్తే ఇంకా బాగుండేది. టీమిండియాకు మరెంతో చేస్తానన్న నమ్మకం ఉంది. మ్యాచులో భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకమని భావించా. నా ఇన్నింగ్స్ నిర్మించిన విధానానికి ఆనందంగా ఉంది. సహనంతో ఉండి ఆత్మవిశ్వాసంతో ఆడా' అని అయ్యర్ తెలిపాడు.

ప్రతి ఒక్కరికీ చెడు రోజులు ఉంటాయి:
'కేఎల్ రాహుల్ షాట్లు అద్భుతంగా ఉన్నాయి. అతడు బంతిని చాలా బాగా చూస్తున్నాడు. రాహుల్ తొలి సిక్స్ బాదగానే ఇదే విషయం అడిగాను. మంచి సమాధానం ఇచ్చాడు. 348 పరుగుల లక్ష్య ఛేదన ఏ జట్టుకైనా అంత సులభమేమీ కాదు. న్యూజిలాండ్ అద్భుతంగా ఆడింది. ఒకరు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగా.. మిగతావారు దూకుడుగా ఆడారు. ప్రతి ఒక్కరికీ చెడు రోజులు ఉంటాయి. మేం బాగానే ఫీల్డింగ్ చేస్తాం. కొన్ని సార్లు తప్పిదాలు జరుగుతాయి' అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.

2017లో న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక:
గత రెండేళ్ల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అయ్యర్ పరిణితి సాధించాడు. 2017 నవంబర్లో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు ఎంపికైన శ్రేయస్ ఆ తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. సపారీలతో మూడు వన్డేలు ఆడిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. ఈ మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. విండీస్, లంక, ఆసీస్ సిరీస్‌లలో సత్తాచాటాడు.


Click it and Unblock the Notifications












