సౌరవ్‌ గంగూలీని ఇరుకునపడేసిన శ్రేయస్ అయ్యర్.. తీవ్ర దుమారం!

దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయస్ అయ్యర్ చేసిన ఓ కామెంట్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఇరుకున పడేసింది. కింగ్స్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా కామెంటేటర్ సైమన్ డౌల్‌తో మాట్లాడిన అయ్యర్.. తనకు మార్గనిర్దేశనం చేసేందుకు పాంటింగ్, గంగూలీ దగ్గర ఉండటం అదృష్టమని వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో తనతో పాటు టీమ్‌కు కూడా దాదా సహాయం చేస్తున్నాడని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. వివాదానికి దారితీసిన తన వ్యాఖ్యలపై అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. 'ఓ యువ సారథిగా గత సీజన్‌లో నాకు అండగా నిలిచిన పాంటింగ్, గంగూలీకి ధన్యవాదాలు చెప్పే క్రమంలోనే అలా మాట్లాడను. నా వ్యక్తిగత వృద్ధిలో వారిద్దరూ పోషించిన పాత్రకు కృతజ్ఞతను నొక్కి చెప్పడమే నా ఉద్దేశం.'అని ట్వీట్‌ చేశాడు.

బీసీసీఐ బాస్‌గా ఓ ఫ్రాంచైజీకి సహకారమా?

బీసీసీఐ బాస్‌గా ఓ ఫ్రాంచైజీకి సహకారమా?

బీసీసీఐ బాస్‌గా ఉంటూ కూడా ఐపీఎల్‌లో సౌరవ్‌ గంగూలీ వెనకనుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు సహకారం అందిస్తున్నాడా? నిబంధన ప్రకారం ఇది కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ కిందకు రాదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రేయస్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలపై ఇతర ఫ్రాంచైజీలు, బోర్డులోని కొందరు సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఢిల్లీ జట్టుకు గంగూలీ మెంటార్‌గా వ్యవహరించాడు కాబట్టి గౌరవపూర్వకంగా గంగూలీకి అయ్యర్ కృతజ్ఞతలు చెబితే సరిపోయేది. ఎలాంటి సమస్య ఉండకపోయేది కానీ అతని మాటల్లో తాజా సీజన్‌ గురించి చెప్పినట్లుగా అర్థమైంది.

గంగూలీ ఉండగా..

గంగూలీ ఉండగా..

తన కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ అయ్యర్‌... ‘ఒక కెప్టెన్‌కు ఉత్సాహం, పట్టుదలవంటి లక్షణాలు ఉండాలి. గత కొన్నేళ్లుగా ఇలాంటివి నేను అలవర్చుకున్నాను. అయినా మన చుట్టూ పాంటింగ్‌ (జట్టు హెడ్‌ కోచ్‌), గంగూలీ స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు సహజంగానే మన పని సులువవుతుంది' అని అయ్యర్‌ పేర్కొన్నాడు. బోర్డు అధ్యక్షుడు ఒక ఫ్రాంచైజీతో ఇలా అనుబంధం కొనసాగించడం సరైంది కాదని బీసీసీఐ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యవహారం లీగ్‌కు చెడ్డ పేరు తెస్తుందని చెప్పారు.

అలా అనడం సరికాదు..

అలా అనడం సరికాదు..

మరికొందరు మాత్రం బీసీసీఐ బాస్‌గా ఉండి గంగూలీ ఓ ఫ్రాంచైజీతో అసోసియేట్ అయ్యాడని అనడం సరికాదంటున్నారు. అయ్యర్‌ను కూడా తప్పుబట్టాల్సిన అవసరంలేదని కూడా చెబుతున్నారు. ‘అయ్యర్ ఓ క్రికెటర్. అతను ఆట గురించే మాట్లాడతాడు. ఈ సీజన్‌కు తాము ఎలా ప్రిపేర్ అవుతామని దాని గురించి అతను చెప్పిన మాటల్లో తప్పేమి లేదు. కాకపోతే ఇలాంటి విషయాల్లో బాధ్యత తీసుకోవాల్సింది ఆ ఫ్రాంచైజీ. బీసీసీఐనే, లేదంటే బోర్డు , ఐపీఎల్‌కే నష్టం'అని అభిప్రాయపడుతున్నారు.

కాన్‌ఫ్లిక్ట్ కొత్త కాదు..

కాన్‌ఫ్లిక్ట్ కొత్త కాదు..

గంగూలీపై ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్ ఆరోపణలు రావడం కొత్త కాదు. ఐపీఎల్‌కు డ్రీమ్‌11 టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా దాని పోటీ ఫాంటసీ క్రికెట్‌ యాప్‌ మై సర్కిల్‌ 11కు... భారత క్రికెట్‌ జట్టు స్పాన్సర్‌ బైజూస్‌కు పోటీ అయిన ఆన్‌లైన్‌ టీచింగ్‌ కంపెనీ అన్‌ అకాడమీకి గంగూలీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. భారత క్రికెట్‌ జట్టు స్పాన్సర్లలో ఒకటైన అంబుజా సిమెంట్‌ పోటీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్‌కు అతను ప్రచారం చేయడం కూడా తప్పని విమర్శలు వినిపించాయి.

RCB vs SRH trolls: ఓయ్ విజయ్ శంకర్ ఏందీ ఈ ఆట.. రాయుడు 3డీ గ్లాస్‌లో చూస్తున్నాడు!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 22, 2020, 10:28 [IST]
Other articles published on Sep 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X