Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకు అలాంటి మాటలు వినడం అస్సలు నచ్చదు: శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జియోస్టార్‌లోని బిలీవ్ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా, గతంలో షార్ట్ పిచ్ బంతులను (బౌన్సర్లను) ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడనే విమర్శలు ఎదుర్కొన్న అయ్యర్, ఇప్పుడు తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరొందిన జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒక అద్భుతమైన సిక్సర్ బాది, తన బలహీనతపై విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించాడు. తనపై వస్తున్న విమర్శలకు మైదానంలోనే దీటైన సమాధానం చెప్పి తన సత్తా చాటాడు.

అయ్యర్ మాట్లాడుతూ .. నా చుట్టూ ఉన్న కొందరు నీ వల్ల కాదు, ఇది అసాధ్యం అని ఎవరైనా అంటే నాకు అస్సలు నచ్చదు. ఒక క్రికెటర్‌గా అలాంటి మాటలను నేను అంగీకరించలేను. ఎవరైనా నన్ను తక్కువ అంచనా వేసినప్పుడు, వారు చెప్పింది తప్పని నిరూపించాలనే పట్టుదల నాలో పెరుగుతుంది. గాయపడినప్పుడు త్వరగా కోలుకుని మరింత బలంగా మైదానంలోకి రావడానికి ఆ విమర్శలే నాకు స్ఫూర్తినిస్తాయి. విమర్శలను ఎదుర్కొని బలంగా తిరిగి రావడమే నా లక్ష్యం అని అయ్యర్ తన మనసులోని మాటను పంచుకున్నాడు.

Shreyas Iyer Punjab Kings Captain Responds about How He Turned Criticism into motivation

వెన్నునొప్పి గాయంతో ఉన్నప్పుడు, నేను మళ్లీ గతంలోలా ఆడలేనని కొందరు విమర్శించారు. కానీ నాపై నాకు నమ్మకం ఉంది. గాయం తర్వాత మన ఆలోచనలు ఎంత బలంగా ఉంటే అంత త్వరగా కోలుకోవచ్చని నేను నమ్ముతాను. దేనిని పట్టించుకోవాలి, దేనిని వదిలేయాలి అనేదే ముఖ్యం. అలాగే, బౌన్సర్ల విషయంలో నేను ఎదుర్కొంటున్నా సమస్యలు గురించి వస్తున్న మాటలు నన్ను బాగా ఆలోచింపజేశాయి. ఆ విమర్శలనే సవాలుగా తీసుకుని నా లోపాన్ని సరిదిద్దుకోవడానికి కష్టపడి పనిచేశాను అని అయ్యర్ తన మైండ్ సెట్ గురించి వివరించాడు.

షార్ట్ బాల్స్ విషయంలో నేను ఎదుర్కొంటున్నా సమస్యలను అధిగమించలేనని చాలా మంది అన్నారు, ఆ మాటలు నన్ను మరింత పట్టుదలతో శ్రమించేలా చేశాయి. వారు చెప్పింది తప్పని నిరూపించడానికే నా బ్యాటింగ్ తీరును మార్చుకున్నాను. గతంలో షార్ట్ బాల్స్ వస్తే డిఫెండ్ చేయడానికి ప్రయత్నించేవాడిని, కానీ ఇప్పుడు నా జోన్‌లోకి వస్తే సిక్సర్‌గా మారుస్తున్నాను. నా చిన్నప్పటి కోచ్ ప్రవీణ్ ఆమ్రేతో పాటు అభిషేక్ నాయర్ సలహాలు తీసుకుంటూ నా ఆటను మెరుగుపరుచుకున్నాను అని అయ్యర్ వివరించాడు.

Story first published: Tuesday, April 28, 2026, 16:57 [IST]
Other articles published on Apr 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+