Shreyas Iyer:కోహ్లీని అధిగమించిన శ్రేయస్ అయ్యర్.. నెం.4లో మనోడే నెంబర్ వన్!
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లోనూ కష్టాల్లోకి వెళ్లిన తన జట్టును కాపాడుకున్నాడు. ఒత్తిడి పరిస్థితుల్లో క్రీజలోకి వచ్చిన అతడు ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. జట్టు 30/3 కష్టాల్లోకి వెళ్లిన సమయంలో.. 98 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్ లతో 79 పరుగులు అర్ధ శతకం నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో తాను బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ అని మరోసారి నిరూపించాడు.
న్యూజిలాండ్ పై వరుసగా రెచ్చిపోతూ..
ఇప్పుడే కాదు గతంలో న్యూజిలాండ్ పై అయ్యర్ కు మంచి రికార్డ్ ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లోనూ న్యూజిలాండ్ పై శ్రేయస్ 100 సెంచరీ సాధించాడు. 103(107), 52(57), 62(63), 80(76), 49(59), 33(29) - 2023 వన్డే వరల్డ్ కప్, 105(70) - 2023 వరల్డ్ సెమీఫైనల్, 79(98) - 2025 ఛాంపియన్స్ ట్రోఫీ... స్కోర్లు చేశాడు అయ్యర్. మొత్తంగా నాలుగు అర్ధ శతకాలు, రెండు శతకాలు కొట్టాడు. ఇంకా చెప్పాలంటే ఈ మిడిలార్డర్ బ్యాటర్ న్యూజిలాండ్ పై 8 వన్డేల్లో 70.37 సగటుతో 563 పరుగులు చేశాడు.

గత 11 వన్డే ఇన్నింగ్స్ లో నెం.4లో...
నెం.4 స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ప్రతీసారి నిలకడగా రాణిస్తున్నాడు అయ్యర్. అలా ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ నెం.4లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరును (79) నమోదు చేశాడు. గత 11 వన్డే ఇన్నింగ్స్ లో నెం.4లో అయ్యర్ స్కోర్లు 82(56), 77(87), 128*(94), 105(70), 4(3), 59(36), 44(47), 78(64), 15(17), 56(67), 79(98)గా ఉన్నాయి.
కోహ్లీ రికార్డ్ బ్రేక్..
అయ్యర్.. నెం.4 స్థానంలో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ స్థానంలో విరాట్ 15 సార్లు హాఫ్ సెంచరీలు చేస్తే.. అయ్యర్ 16 సార్లు బాదాదు. తద్వారా జోరూట్, బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో రాస్ టేలర్ (65 హాఫ్ సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఐసీసీ టోర్నమెంట్స్ లో నిలకడగా రాణిస్తూ..
ఐసీసీ టోర్నమెంట్స్ లోనూ శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడు. ఐసీసీ ఈవెంట్స్లో అతడు మొత్తం 14 ఇన్నింగ్స్ లో 61.81 యావరేజ్, 104.78 స్ట్రైక్ రేట్ తో 680 పరుగులు చేశాడు. అందులో 2 శతకాలు, 5 అర్ధ శతకాలు ఉన్నాయి. గత ఎనిమిది ఇన్నింగ్స్ లో 78.85 సగటు, 111.3 స్ట్రైక్ రేట్ తో 552 పరుగులు చేశాడు. 88(56), 77(87), 128*(94), 105(70), 4(3), 15(17), 56(67), 79(98) స్కోర్లుగా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications