ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇండియా-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ ఇండియా-ఏ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. అంతకుముందు, ఆస్ట్రేలియా 'A'తో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ ఇండియా-ఏ కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే, రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది సమయం ముందు ఆయన ఆకస్మికంగా కెప్టెన్సీని వదులుకుని జట్టు నుంచి విడుదల కావడం చర్చనీయాంశమైంది.
కెప్టెన్సీని ఎందుకు వదిలారు?
రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని వదులుకోవడానికి ప్రధాన కారణం వెన్ను నొప్పి. గతంలో శస్త్రచికిత్స చేయించుకున్న శ్రేయస్ అయ్యర్.. మళ్లీ వెన్నులో కొద్దిగా పట్టేసినట్టు (Cramps), బిగుసుకుపోయినట్టు (Stiffness) అనిపిస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే ఆయన రెడ్ బాల్ క్రికెట్ నుంచి ఆరు నెలలు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన బీసీసీఐకి కూడా తెలియజేశారు. ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు సారథిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

మొదటి వన్డేకు ఇండియా 'A' జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, యుద్ధవీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, సిమర్‌జీత్ సింగ్.
రెండు, మూడు వన్డేలకు ఇండియా 'A' జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్-కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, యుద్ధవీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.
ఇరానీ కప్ కోసం 'రెస్ట్ ఆఫ్ ఇండియా' జట్టు:
రజత్ పాటిదార్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్-కెప్టెన్), యశ్ ధుల్, షేక్ రషీద్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తనుష్ కోటియన్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, ఆకాష్ దీప్, అన్షుల్ కంబోజ్, సారన్ష్ జైన్.